https://www.fapjunk.com https://pornohit.net london escort london escorts buy instagram followers buy tiktok followers Ankara Escort Cialis Cialis 20 Mg
Sunday, February 25, 2024
Sunday, February 25, 2024

దోపిడీపై పోరుకు పోర్చుగీసు పిలుపు

లిస్బన్‌: పోర్చుగీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (పీసీపీ) వార్షికోత్సవం ‘‘అవంతే! ఫెస్టివల్‌’’ (ఫెస్టా దో అవంటే) ఘనంగా జరిగింది. ఈసందర్భంగా జరిగిన ఉత్సవాలకు వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. సీక్సల్‌లోని క్వింటా డా అటాలియా వద్ద ఈ వార్షికోత్సవం జరిగింది. వార్షికోత్సవం చివరి రోజున, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి జెరోనిమో డి సౌసా ముఖ్య వక్తగా ప్రధాన రాజకీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను పీసీపీి నాయకుడు ప్రస్తుతించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, యుఎస్‌, ఈయూ, నాటో ఆంక్షలు, పోర్చుగీస్‌ ప్రభుత్వ సహకారంతో ఇంధనం, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, ప్రజల జీవన పరిస్థితులపై దాడులు, ప్రపంచాన్ని తీవ్రమైన ఆర్థిక, సామా జిక మాంద్యంలోకి దిగజారే పరిణామాలపై కింకర్తవ్యాలనును ప్రస్తుతించారు. ప్రజలు శాంతిని కోరుకుంటారు, యుద్ధం కాదు. పీసీపీ , శాంతి, సామరస్యంతో ప్రజల హక్కులను గౌరవించే విధంగా సార్వభౌమాధికారాన్ని, అభివృద్ధి మార్గం, శాంతి, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి పోర్చుగీస్‌ ప్రభుత్వం విధానలపై దాడి చేశారు. ‘‘ఈ రోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ‘‘అవంతే!’’ పోర్చుగీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ అధికారిక వార్తాపత్రిక పేరు పెట్టిన ఈ వార్షికోత్సవం 1976 నుండి ప్రారంభమైంది. పోర్చుగల్‌ నలుమూలల నుండి యువతీ యువకులు ఈ వార్షికోత్సవానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img