Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రపంచ స్థాయికి సైన్యం

యుద్ధాల్లో గెలవాలంటే రక్షణ వనరులు అవశ్యం: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌
బీజింగ్‌: తమ దేశ అణచివేతకు అమెరికా నేతృత్వంలో చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తాజాగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సాయుధ దళాలను సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ వ్యూహాత్మక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని అన్నారు. యుద్ధాల్లో గెలవాలంటే రక్షణ వనరులు ఎంతో అవసరమని, వాటిని పెంచుకోవాలని సూచించారు. రక్షణ సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు పుంజుకోవాలని, మరే దేశంపై ఆధారపడాల్సిన అవసరం రాకుండా అవసరమైన పరిశోధనలను ముమ్మరం చేయాలని జాతీయ ప్రయోగశాలలకు జిన్‌పింగ్‌ ఆదేశాలిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం, సరఫరా గొలుసులు, నిల్వల తరహా రక్షణపరమైన వనరుల వినియోగాన్ని చైనా మెరుగుపర్చుకోవాలని, తద్వార సైన్యాన్ని మరింత శక్తిమంతమైనదిగా తయారు చేసుకోవడంతో యుద్ధాల్లో గెలవొచ్చని పార్లమెంటు వార్షిక సమావేశంలో జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు. ‘సమగ్ర వ్యూహాత్మక సామర్థ్యాల మెరుగుదల అధికార కమ్యూనిస్టు పార్టీకి కొత్త ఏర్పడిన ఆవశ్యకత. పారిశ్రామిక సరఫరా గొలుసుల స్వావలంబన పెరగాలి. మౌలికవసతుల నిర్మాణం జరగాలి. రక్షణ అవసరాల కోసం జాతీయ వనరులు అవసరం’ అని జిన్‌పింగ్‌ తెలిపారు. అమెరికాతో పాటు ఇతర దేశాల విషయంలో చైనా మరింత స్పష్టమైన వైఖరితో ముందుకెళుతోందన్నారు. తైవాన్‌ కోసం శక్తిని వాడటంలేదన్నారు. సైన్యం పరిష్కరించాల్సిన అవసరమున్న వ్యూహాత్మక ముప్పులు ఏమిటో మాత్రం ఆయన చెప్పలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img