Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘మా చావులు… వారికి లాభాలు’

. గ్రీస్‌ వీధుల్లో మార్మోగిన నినాదం
. రైలు ఘటనకు దేశవ్యాప్త నిరసన `భారీ ర్యాలీలు
. వేలాదిగా పాల్గొన్న కార్మికులు, విద్యార్థులు, యువత
. ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌

ఏథెన్స్‌: ‘మా చావులు… వారికి లాభాలు’ అన్న నినాదం గ్రీస్‌ నగరాన్ని దద్దరిల్లించింది. ఫిబ్రవరి 28న లారిస్సాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న డిమాండు మార్మ్రోగింది. రైలు ఘటనకు నిరసనగా గ్రీస్‌లో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. వేలాది మంది కార్మికులు, స్కూలు పిల్లలు, విద్యార్థులు, యువతీ యువకులు ర్యాలీల్లో పాల్గొన్నారు. బాధ్యత వహించకుండా పాలకులు తప్పించుకోలేరని నినదించారు. ఈనెల 5వ తేదీన ఏథెన్స్‌లోని సైంటాగ్మా స్క్వేర్‌ వద్ద రైల్వే కార్మికుల 48 గంటల సమ్మెకు కొనసాగింపుగా తాజా ప్రదర్శనలు జరిగాయి. దుర్ఘటనలో 57 మంది మరణించగా మృతుల్లో యువత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వంపై ప్రజలు కన్నెర్రచేశారు. మనుషుల జీవితాలు, భద్రతను పణంగా పెట్టి నేరపూరిత విధానాలను అమలు చేస్తుండటం ఇటువంటి పరిణామానికి దారితీసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ దుర్ఘటనకు కారణమైన వారిని ఉపేక్షించేందుకు వీల్లేదని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఈ నేరాన్ని కప్పిపుచ్చలేరు. ఆధునికసురక్షితసరసమైన ప్రజారవాణా సౌకర్యాలు కల్పించాలి. లాభాపేక్షను విడనాడి నేరపూరిత విధానాలను రద్దు చేయాలి’ అని నిరసనకారులు నినదించారు. ఓమోనియా నుంచి సైంటాగ్మా స్క్వేర్‌ వరకు ఈ నినాదం మారుమ్రోగింది. అటు ఏథెన్స్‌లోని వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. ‘‘సమయం బాగాలోక ఘోరం జరిగిందని అనవద్దు. కేపిటలిస్టు లాభాలు, దానిని గడిరచే ప్రభుత్వాన్ని పాలకులనే నిందించాలి’ అన్న నినాదం గ్రీస్‌వ్యాప్తంగా వినిపించింది. కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల వారు నిరసనల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు’ అని విలేకరులతో మాట్లాడిన గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌంట్‌సోంబస్‌ అన్నారు. ఏథెన్స్‌తో పాటు థెస్సాలోనికి, పాత్రాస్‌, లారిస్సా వంటి పెద్ద నగరాల్లో, లోయన్నినా, ఛనియా, హెరాక్‌లైన్‌, రోడ్స్‌ ద్వీపంలోనూ భారీగా నిరసనలు జరిగాయి. దాదాపు దశాబ్దంలో ఇంత స్థాయిలో ప్రజలు నిరసన జరగలేదని స్థానిక మీడియా పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img