Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విమానం తలుపు పక్కన కూర్చోనుగా!

బోయింగ్‌ విమానాల్లో నాణ్యతా లోపాలపై బైడెన్‌
వాషింగ్టన్‌: ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ బోయింగ్‌ విమానం తలుపు పక్కన కూర్చోను అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడిరచారు. ఈమధ్య కాలంలో బోయింగ్‌ విమానాల్లో నాణ్యతా లోపాలు వెలుగులోకి రావడాన్ని ఉద్దేశించి అధ్యక్షుడు ఈ విధంగా చమత్కరించారు.
బైడెన్‌ ఓ టాక్‌లో పాల్గొన్నారు. న్యూయార్క్‌ వెళ్లేముందు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ (అధ్యక్షుడు ప్రయాణించే విమానం) బోల్టులను రవాణాశాఖ మంత్రి సరిగా బిగించారా అంటూ వ్యాఖ్యత ప్రశ్నిస్తే… నేను అసలు తలుపు దగ్గర కూర్చోనుగా’ అని బైడెన్‌ సరదాగా అన్నారు. అయితే ఇలాంటి విషయాల్లో తమాషా సరికాదని కూడా ఆయనన్నారు. ఇటీవల అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తుండగా విమానం తలుపు ఊడి కిందపడిరది. ఆ సమయంలో విమానం 16 వేల అడుగుల ఎత్తులో ఎగురుతోంది. అందులో 171 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతకుముందు కూడా బోయింగ్‌ విమానాల్లో భద్రతాపరమైన లోపాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img