Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అమెరికాకు తైవాన్‌ అధ్యక్షురాలు

తాయువాన్‌/బీజింగ్‌: తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌ వెన్‌ అమెరికాకు వెళ్లారు. చైనా ఒత్తిళ్లకు తలొగ్గేదిలేదని, హెచ్చరికల వల్ల మిగతా ప్రపంచానికి దూరంగా ఉండబోమని బుధవారం అమెరికాకు బయల్దేరే ముందు ఇంగ్‌వెన్‌ స్పష్టంచేశారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య మార్గంలో తైవాన్‌ వెళుతుందని ఆ దేశ అధ్యక్షురాలు తేల్చిచెప్పారు. ఈ పర్యటనలో భాగంగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ కెవిన్‌ మెక్‌కార్తెతో ఆమె భేటీ అవుతారు. పది రోజుల పర్యటనలో భాగంగా గ్వాటెమాలా, బెలిజెల్లోనూ పర్యటిస్తారు. తొలుత న్యూయార్క్‌కు వెళతారని, పర్యటన ముగించే ముందు లాస్‌ ఏంజిల్స్‌లో పర్యటిస్తారని అధికారులు తెలిపారు. మాక్‌ మెక్‌కార్తీతో కాలిఫోర్నియాలో భేటీ అవుతారని సమాచారం. ఇదిలావుంటే, త్సాయ్‌ ఇంగ్‌వెన్‌ అమెరికా పర్యటనను తైవాన్‌ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి రaా ఫెంగ్లియన్‌ ఖండిరచారు. అమెరికన్‌ అధికారులతో సమావేశం కూడా అవుతున్నారని, ఇది మరో కవ్వింపు చర్య కాగలదని అన్నారు. ఒకే చైనా సూత్రాన్ని ఉల్లంఘిస్తున్నారని హెచ్చరించారు. చైనా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. తైవాన్‌ జలసంధిలో శాంతి, సుస్థిరతలను దెబ్బతీస్తోందని కూడా ఆయన వెల్లడిరచారు. ఈ పర్యటనను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img