Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆయుధాలు చేపట్టిన ఆఫ్గాన్‌ మహిళలు

దశాబ్దాలనాటి పరిస్థితులను సహించం

కాబూల్‌ : సహనానికి మారుపేరుగా ఉండే మహిళలు ఒక్కసారిగా తుపాకులు చేపట్టారు. తాలిబన్ల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తామంటూ మద్దతు పలికారు. ఆఫ్గానిస్తాన్‌లో రోజురోజుకీ తాలిబన్ల బలం పెరగడంతో మహిళలు సైన్యానికి మద్దతుగా నిలిచారు. తాలిబన్ల పాలనలో మహిళలకు స్వేచ్ఛ ఉండదు. చదువు, ఉద్యోగం వంటి అవకాశాలను కోల్పోవలసి వస్తుంది. తిరిగి ఆఫ్గాన్‌ ప్రజల జీవన దుస్థితి 20 సంవత్స రాల వెనక్కి వెళ్లవలసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం మహిళలు ఆయుధాలు చేపట్టారు. తమ దేశ జెండాలను, ఆయుధాలను పట్టుకుని వందలాది మహిళలు వీధుల్లో నిల్చొని తాలిబన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సైనికులకు మద్దతు ప్రకటిస్తున్నారు. ‘ఏ మహిళ పోరాడేందుకు ఇష్టపడదు. నేను నా విద్యను కొనసాగించాలి.. హింసకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ పరిస్థితులు నన్ను తుపాకులు చేతపట్టించాయి’ అని ఉత్తర జౌజ్జాన్‌కు చెందిన ఒక మహిళ పేర్కొన్నారు. దేశంలోని బోజ్జన్‌, గౌర్‌, కాబూల్‌, ఫర్యాబ్‌హెరత్‌ వంటి అనేక నగరాలలో మహిళలు తుపాకులతో పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. మహిళలు స్వేచ్ఛ కోసం, హింసకు వ్యతిరేకంగా నిలబడాలని సయిదా ఘజ్నివాల్‌ అనే మహిళ పేర్కొంది. కేవలం ప్రభుత్వం మాత్రమే ఉగ్రవాదులను ఎదుర్కోలేదని, దేశ ప్రజలు కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఆఫ్గానిస్తాన్‌ పూర్తిగా స్వతంత్రం పొందేవరకు మహిళలు పోరాటం చేస్తారని, దశాబ్దాల క్రితం నాటి పరిస్థితులు తలెత్తకుండా అడ్డుకుంటామని మహిళలు శపథం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img