Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఆహారం కోసం వెళ్లి సముద్రంలో మునిగారు

గాజాలో దయనీయం…18 మంది మృతి
గాజా: ఇజ్రాయిల్‌ దాడులతో సర్వం కోల్పోయిన గాజా ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు మానవతా సాయం చేసేందుకు ముందుకొస్తున్న విషయం తెలిసిందే. రోడ్డు, వాయు, సముద్ర మార్గాల ద్వారా ఆహారాన్ని అందజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా విమానాలు జారవిడిచిన ఆహారం డబ్బాలను చేజిక్కుంచుకునేకి సముద్రంలోకి వెళ్లి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 12 మంది ఆహార డబ్బాలు పడి మరణించగా మరో ఆరుగురు నీటి ప్రవాహానికి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఉత్తర గాజాలోని బీచ్‌ లాహియా బీచ్‌లో చోటు చేసుకుంది. పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడిరచారు. ఇజ్రాయిల్‌`హమాస్‌ మధ్య యుద్ధంతో పలస్తీనాలోని గాజాలో విధ్వంసం నెలకొంది. ఓ వైపు పౌరుల మరణాలు, మరోవైపు ఆకలి కేకలతో గాజాలో పరిస్థితి దయనీయంగా మారింది. తినేందుకు తిండి లేక, తాగేందుకు నీళ్లు లేక, తలదాచుకునేందుకు గూడు లేక అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజా ఘటనపై అమెరికా స్పందించింది. మానవతాసాయం కింద పంపిన 18 బండిల్స్‌లో మూడు పారాచూట్‌లు పనిచేయలేదని తెలిపింది. దీంతో అవి నీటిలో పడిపోయాయని, వాటిని చేజిక్కించుకునేందుకు వెళ్లిన పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. అయితే, మరణాలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ లేదని పేర్కొంది. గాజా బీచ్‌లో ఆహార పొట్లాలు జారవిడవడం, మృతులను తీరానికి చేరుస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img