Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

భారత సిబ్బంది వల్లే ఎన్నో ప్రాణాలు నిలిచాయి: బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెనను నౌక ఢీకొనడంతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. సహాయక సిబ్బంది, నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. నౌక తమ నియంత్రణ కోల్పోయిందని గుర్తించిన సిబ్బంది తక్షణమే స్పందించి, మేరీలాండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అథారిటీని అప్రమత్తం చేశారని… దాంతో స్థానిక అధికారులు వంతెనపై రాకపోకలను ఆపివేశారని బైడెన్‌ చెబుతూ వారి అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిరదన్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అత్యవసర పరిస్థితిలో అన్ని వనరులను అందుబాటులో ఉంచామన్నారు. తమ ప్రభుత్వం వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడిరచారు. సింగపూర్‌ జెండాతో ‘డాలీ’ అనే నౌక బాల్టిమోర్‌ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆరుగురి మృతి?
వంతెన కూలిన ప్రమాదంలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపును నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో వీరంతా వంతెనపై గుంతలు పూడుస్తున్నారని మేరీల్యాండ్‌ రవాణాశాఖ కార్యదర్శి పాల్‌ వైడెఫెల్డ్‌ తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నది లోతు, కనిపించకుండా పోయిన తర్వాత గడిచిన సమయాన్ని బట్టి చూస్తే మరణించి ఉంటారని వారిని పనికి నియమించుకున్న కంపెనీ బ్రానర్‌ బిల్డర్స్‌ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img