Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇటలీలో టీయూలకు మద్దతుగా ర్యాలీ

ఇటలీ: ట్రేడ్‌ యూనియన్లపై వేధింపులను నిరసిస్తూ వారికి మద్దతుగా ఇటలీలోని పియాసెంజాలో పెద్దఎత్తున నిరసన జరిగింది. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని ఎమిలియా రొమాగ్నాలోని పియాసెంజాలో జరిగిననీ భారీ ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు, పురుషుల, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గృహనిర్బంధంలో ఉన్న ఎనిమిది ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలను, సి కోబాస్‌, యూఎస్‌బీ యూనియన్‌ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యుఎస్‌బి, సి కోబాస్‌ యూనియన్‌లకు వ్యతిరేకంగా పియాసెంజా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం చేపట్టిన నేరారోపణ ఆధారంగా ట్రేడ్‌ యూనియన్‌ కార్యకర్తలను జూలై 19న గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. బహుళజాతి సంస్థల గిడ్డంగుల వద్ద సమ్మెలు నిర్వహించడం, ఆయుధాలను కలిగిఉన్నారన్న నెపంతో వీరిపై పోలీసు అధికారులు యుఎస్‌బీ జాతీయ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో ఉపయోగించే మందుగుండు సామగ్రి, ఆయుధాలను పంపడానికి జెనోవా వంటి ఇటాలియన్‌ నౌకాశ్రయాలను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ యుఎస్‌బీ ట్రేడ్‌ యూనియన్‌ నిర్వహించిన నిరసనలపై పోలీసుల దాడి జరిగింది. జూలై 20న విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో సికోబాస్‌, యూఎస్‌బీ ఇతర ట్రేడ్‌ యూనియన్‌లు పెద్ద ఎత్తున రాజకీయ దాడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నాయి. పెట్టుబడిదారీ సంక్షోభ పురోగతి, యుద్ధ ఆర్థిక వ్యవస్థ, అధిక జీవన వ్యయం, పెరుగుతున్న సామాజిక అనారోగ్యం, కార్మికులపై ముఖ్యంగా ట్రేడ్‌ యూనియన్‌లపై పెరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ), ఫంట్‌ ఆఫ్‌ కమ్యూనిస్ట్‌ యూత్‌ సంఫీుభావం ప్రకటించింది. వీరిపై నమోదుచేసిన ఆరోపణల నుండి కార్మికులను తక్షణమే నిర్దోషులుగా ప్రకటించాలని, గృహనిర్బంధంలో ఉన్న కార్మిక సంఘాలను విడుదల చేయాలనే డిమాండ్‌ చేసింది. ఇటలీలో ట్రేడ్‌ యూనియన్‌ చర్యలను నేరంగా పరిగణించే ప్రయత్నాలను పీఏఎమ్‌ఈ ఖండిరచింది. వరల్డ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ ఇటలీలోని ట్రేడ్‌ యూనియనిస్టుల పక్షాన నిలబడాలని ఇటువంటి దాడులను ఖండిస్తూ నిరసన తెలియజేయాలని దాని అనుబంధ సంస్థలకు పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img