Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉత్సాహంగా కొమ్సోమోల్‌ వార్షిక సంబరాలు

మాస్కో : రష్యాలో కొమ్సోమోల్‌ 103వ వార్షిక సంబరాలు ఘనంగా జరిగాయి. రష్యాతోపాటు ఇతర నగరాల్లో సైతం కమ్యూనిస్టు పార్టీ, యువజన సంఘాల కార్మికులు, సభ్యులు, మద్దతుదారులు అక్టోబరు 29న వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. మాస్కోలోని రెడ్‌స్వ్కేర్‌లో కొమ్సోమోల్‌ అని పిలిచే ఆల్‌`యూనియన్‌ లెనినిస్ట్‌ యంగ్‌ కమ్యూనిస్టు లీగ్‌ స్థాపించి 103 సంవత్సరాలు పూర్తయింది. కొమ్సోమోల్‌ సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీకి ఊపిరి అని చెప్పవచ్చు. లెనిన్‌ మాటల్లో.. ఇది యువతరానికి ‘కమ్యూనిజం సిద్ధాంతాల బోధనకు’ ఉద్దేశించిన సంస్థ. 1918లో రష్యాపై దాడి చేసిన విదేశీ శక్తులకు వ్యతిరేకంగా కొమ్సోమోల్‌ సభ్యులు అక్టోబరు విప్లవానికి పూర్తి స్థాయిలో తమ మద్దతును ప్రకటించి వీరోచితంగా పోరాటం చేశారు. కొమ్సోమోల్‌ దేశంలో సోషలిజం స్థాపన కోసం అత్యంత చురుగ్గా పాల్గొంది. దేశంలో నిరుద్యోగానికి, నిరక్షరాస్యతకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టింది. కొమ్సోమోల్‌ దేశ పారిశ్రామిక ప్రక్రియలో అత్యంత చురుగ్గా పాల్గొంది. కులాక్స్‌, ఇతర విప్లవ సంస్థలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసింది.
రష్యాపై నాజీల దండయాత్ర సమయంలో కొమ్సోమోల్‌కు చెందిన వేలాది మంది సభ్యులు సోవియెట్‌ విజయం కోసం పోరాడారు. ఫాసిజం ఓటమి కోసం వందలాదిమంది తమ ప్రాణాలు అర్పించారు. యుద్ధం అనంతరం యువ కమ్యూనిస్టులు సోవియట్‌ యూనియన్‌ పునర్నిర్మాణం కోసం మందంజలో నిలిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img