Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉ.కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం


సియోల్‌/టోక్యో: అమెరికాతో కలిసి దక్షిణ కొరియా సైనిక విన్యాశాలు చేపట్టిన క్రమంలో ఉత్తర కొరియా వరుసగా క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇదే క్రమంలో గురువారం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)ను ప్యాంగ్యాంగ్‌ పరీక్షించింది. ఈ మేరకు సియోల్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వెల్లడిరచారు. ప్యాంగ్యాంగ్‌లోని సునన్‌ ప్రాంతం నుంచి సుదూర లక్ష్యాలను ఛేదించే బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాన్ని తమ సైన్యం గుర్తించినట్లు తెలిపింది. జపాన్‌ ప్రభుత్వం కూడా ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించింది. తమ కోస్ట్‌గార్డ్‌ అంచనా ప్రకారం ప్రయోగించిన గంట తర్వాత అది నిర్దేశిత లక్ష్యానికి చేరినట్లు వెల్లడిరచింది. 70 నిమిషాలు ఆరువేల కిమీలను ఈ క్షిపణి ఛేదించిందని జపాన్‌ రక్షణశాఖ తెలిపింది. తమ దేశ ఆర్థిక జోన్‌ వెలుపల జలాల్లో క్షిపణి పడిరదని జపాన్‌ రక్షణ మంత్రి యసుకాజు హమాదా తెలిపారు. ఓషిమాఓషిమాలో క్షిపణి పడిరదన్నారు. అటు దక్షిణ కొరియా కూడా జపాన్‌ సముద్రంలోకి గుర్తుతెలియని బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఈ మేరకు దక్షిణ కొరియా సైన్యం పేర్కొన్నట్లు యోన్హప్‌ వార్తాసంస్థ వెల్లడిరచింది. దక్షిణ కొరియా`అమెరికా ఫ్రీడమ్‌ షీల్డ్‌ పేరిట జరుగుతున్న సైనిక విన్యాశాల క్రమంలో తాజా ప్రయోగం జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ టోక్యోలో జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడాతో భేటీ అయ్యేందుకు కొన్ని గంటల ముందు ప్రయోగం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img