Friday, April 26, 2024
Friday, April 26, 2024

మా గగనతలంలోకి రావద్దు

అమెరికాకు రష్యా హెచ్చరిక
మాస్కో: అమెరికా డ్రోన్‌ను రష్యా గగనతలంలోకి ప్రవేశించగా దానిని రష్యా పేల్చివేసింది. రష్యా జెట్‌ విమానాలు అమెరికా డ్రోన్‌ను పేల్చివేయగా అది నల్లసముద్రంలో పడిపోయింది. ప్రపంచంలోని రెండు అతిపెద్దశక్తుల మధ్య ఇటువంటి ఘటన ఉక్రెయిన్‌రష్యా యుద్ధం క్రమంలో మొదటిసారి జరిగింది. అమెరికా డ్రోన్‌ తమ గగనతలంలోకి ప్రవేశించడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. మరోసారి ప్రవేశించొద్దని అగ్రరాజ్యాన్ని క్రెమ్లిన్‌ హెచ్చరించింది. వాషింగ్టన్‌తో మాస్కోకు సంబంధాలు చెడిపోయిన విషయాన్ని ప్రస్తావించింది. నల్లసముద్రంలో పడిన అమెరికా గూఢచర్య డ్రోన్‌ శిథిలాలను వెలికితీసేందుకు యత్నిస్తామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికోలాయ్‌ పత్రుషేవ్‌ తెలిపారు. క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో స్పందిస్తూ ఈ ఘటనపై వాషింగ్టన్‌లోని అగ్రస్థాయితో ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్నారు. రష్యా రక్షణ శాఖ ఇప్పటికే విడుదల చేసిన ప్రకటనకు మించి చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు. అమెరికాతో బంధం దయనీయ స్థితిలో ఉందని, నిర్మాణాత్మక చర్చలను రష్యా నిరాకరించలేదని, ఇప్పుడు కూడా నిరాకరించదన్నారు. ఇదిలావుంటే రెండు రష్యన్‌ ఎస్‌యూ27 యుద్ధవిమానాలు గాల్లో ఢీకొనడం వల్ల అంతర్జాతీయ జలాలపై భూ పరిశీలన కోసం వాడే తమ ఎంక్యూ`9 రీపర్‌ డ్రోన్‌లలో ఒకటి ధ్వంసమైందని అమెరికా సైన్యం ప్రకటించింది. సైనికులు తమ డ్రోన్‌పై ఇంధనం పోశారని, దాని ప్రోపెల్లర్‌ను చెడగొట్టారని, దాంతో అది సముద్రంలో కూలిందని వాషింగ్టన్‌ పేర్కొంది. మాస్కో ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. అమెరికా డ్రోన్‌ ఉద్దేశపూర్వకంగా తమ గగనత లంలోకి వచ్చిందని, దానిని గుర్తించి ధ్వంసం చేశామని తెలిపింది. తమ దేశ సరిహద్దుకు దగ్గరల్లో అమెరికా సైనిక చర్యలు ఆమోదయోగ్యం కాదని రాయబారి ఆంటోనోవ్‌ వెల్లడిరచారు. తమ సైనిక బలగాలను దెబ్బతీసేందుకు కీవ్‌ యంత్రాంగం కోసం సమాచారాన్ని కూడకట్టేందుకు ఇంటెలిజెన్స్‌ డ్రోన్లను వాషింగ్లన్‌ వినియోగిస్తోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img