Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎస్టోనియా అధ్యక్షుడిగా అలార్‌ కారిస్‌

టాలిన్‌ : ఫిన్‌లాండ్‌ సరిహద్దుగా యూరప్‌ ఉత్తర ప్రాంత దేశమైన ఎస్టోనియా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అలార్‌ కారిస్‌(63) మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో దేశ అభివృద్ధికి సంయుక్తంగా కృషిచేస్తానని పేర్కొన్నారు. ఎస్టోనియా దేశ, విదేశాంగ విధానాలను మరింత పటిష్టచేయవలసిఉందని పేర్కొన్నారు. ఎస్టోనియాలోని రెండవ అతిపెద్ద నగరం టార్టుకి చెందిన కారిస్‌ ఎస్టోనియన్‌ వర్సిటీ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెన్‌లో పట్టభద్రులు. ఎస్టోనియా అధ్యక్ష ఎన్నికల్లో ఏకైక అభ్యర్థిగా పాల్గొన్న కారిస్‌ దేశంలోని 101 మంది సభ్యుల పార్లమెంటు (రిగికోగు)లో మంగళవారం జరిగిన రెండవ రౌండ్‌ ఓటింగ్‌లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా సోమవారం తగిన మద్దతు పొందడంలో విఫలంకావడంతో మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 72 మంది శాసనసభ్యుల మద్దతుపొందారు. మూడిరట రెండు వంతులు మెజారిటీ సాధించారు. కనీసం 68ఓట్లు సీక్రెట్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికయేందుకు అవసరం. కౌంటింగ్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎస్టోనియన్‌ రిఫార్మ్‌ పార్టీ, సెంటర్‌ పార్టీ ద్వారా నామినేట్‌ అయిన తర్వాత ఎస్టోనియన్‌ నేషనల్‌ ఎలక్టోరల్‌ కమిటీ ద్వారా కారిస్‌ మరోసారి అధ్యక్షుడిగా ఏకైక అభ్యర్థిగా నమోదు అయ్యారు. 20032007 వరకు ఎస్టోనియన్‌ వర్సిటీ లైఫ్‌సైన్సెస్‌లో రెక్టర్‌గా 20072012 వరకు టార్టు వస్సిటీ రెక్టర్‌గా పనిచేశారు. మార్చి 2013లో ఎస్టోనియా ఆడిటర్‌ జనరల్‌గా నియమితులయ్యారు. 2017లో ఎస్టోనియన్‌ నేషనల్‌ మ్యూజియం డైరెక్టరుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img