Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యుద్ధోన్మాదంపై జర్మన్‌ డీకేపీ నిరసన

బెర్లిన్‌: ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా జర్మనీ కమ్యూనిస్టులు(డీకేపీ) సైనికీకరణకు, సైనిక వాదానికి వ్యతిరేకంగా నిరసనకు పిలుపునిచ్చారు. దేశంలో పెరిగిన సైనికీకరణకు వ్యతిరేకంగా డీకేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆయుధాలు, సైనికీకరణ, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా మా నిరసనను ప్రజల్లోకి తీసుకువెళతామని డీకేపీ స్పష్టం చేసింది. ఆగస్టు 15న తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకోవడంతో నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య ఆఫ్గాన్‌కు సైన్యాన్ని పంపాలన్న జర్మనీ ప్రభుత్వ నిర్ణయాన్ని డీకేపీ ఖండిరచింది. సామ్రాజ్యవాద చర్యలకు డీకేపీ తిప్పికొట్టింది. చైనాపై తాజాగా అమెరికా యుద్ధోన్మాదాన్ని, సైనిక దాడులను డీకేపీ ఖండిరచింది. రష్యాతో, చైనాతో నెరపిన శాంతి ఒప్పందాన్ని డీకేపీ ఈ సందర్భంగా హైలైట్‌ చేసింది. యుద్ధ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా జర్మనీ ప్రభుత్వం రష్యా సరిహద్దులో సాయుధదళాల విన్యాసాలు, ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో జర్మనీ యుద్ధ నౌకల ద్వారా పెరిగిన సైనిక వ్యయాన్ని డీకేపీ ప్రశ్నించింది. పాలక సెంటర్‌ రైట్‌ క్రిస్టియన్‌ డెమొక్రాట్స్‌ (సీడీయూ), సోషల్‌ డెమోక్రటిక్‌పార్టీ (ఎస్‌పీడీ) అఫ్గాన్‌లో సాయుధ దళాలకు మద్దతు పలకగా డీకేపీ వామపక్ష లింకె పార్టీ ఖండిరచింది.. జర్మనీ ఛాన్సలర్‌గా 16సంవత్సరాల తర్వాత తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నటు మెర్కెల్‌ ప్రకటించిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు వచ్చే నెల జరుగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img