Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కెనడా నిరసనకారుల అరెస్టు


ఒట్టావా: అమెరికాకెనడా మధ్య అత్యంత రద్దీగా ఉండే సరిహద్దు అంబాసిడర్‌ వంతెనను దిగ్బంధనం చేస్తున్న నిరసన కారులను కెనెడా పోలీసులు అరెస్టు చేశారు. కోవిడ్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా వందలాదిమంది ట్రక్కులతో ఆందోళన చేస్నున్నారు. మా హక్కులను ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తున్నామని నిరసనకారులు పేర్కొన్నారు. వేలాదిమంది ప్రజలు కెనడా జెండాలతో వీధుల్లో నిరసించారు. చాలా రోజులుగా జరుగు తున్న సరిహద్దు దిగ్బంధాన్ని నివారించాలని అమెరికా కోరడంతోే కెనెడా అధికారులు ఈ వంతెనను తెరిచేందుకు ఉపక్రమించారు. అంబాసిడర్‌ వారధి (అమెరికా- కెనడా మధ్య సరిహద్దు బ్రిడ్జి)పై నిలిచిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు ట్రక్కులను కూడా తొలగించారు. రెండు దేశాల మధ్య వాణిజ్యంలో 25శాతం రవాణా నిలిచపోయింది. త్వరలో బ్రిడ్జిని పునఃప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. చాలా వారాలుగా కెనెడాలో కరోనా నిబంధనలను వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళ నలు చేస్తున్నారు. ఫ్రీడమ్‌ కాన్వాయ్‌ అని పిలువబడే అమెరికా కెనడా సరిహద్దును దాటిన ట్రక్కర్లకు కోవిడ్‌ నియంత్రణ టీకాలు వేయాలన్న ఆదేశాలకు వ్యతిరేకంగా ఈ నిరసన ప్రారంభమైంది. ట్రూడో ప్రభుత్వం వైదొలగాలని వీరంతా డిమాండ్‌ చేస్తున్నారు. వీరి ప్రేరణతో యూరప్‌, న్యూజిలాండ్‌లో కూడా ఇలాంటి నిరసనలే ఆరంభమయ్యాయి. నిరసనల కారణంగా రాజధానిలో గతవారం ఎమర్జెన్సీ విధించారు. బ్రిడ్జిపై ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నా మరింత మంది అక్కడికి చేరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img