Friday, April 26, 2024
Friday, April 26, 2024

చైనా`ఆగ్నేయాసియా దేశాల నూతన పురోగతి

ప్రాంతీయ సహకారానికి చైనా మద్దతు
బీజింగ్‌ : చైనాఆగ్నేయాసియా(ఏషియన్‌) దేశాల మధ్య స్నేహపూర్వక సహకారంలో నూతన పురోగతి సాధించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. చైనాఆగ్నేయాసియా దేశాల అసోసియేషన్‌ సంబంధాలకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వీడియో లింక్‌ ద్వారా హాజరైన సమావేశంలో వాంగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌`19కి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటంలో ఆగ్నేయాసియాను చైనా తన ప్రాథమిక భాగస్వామిగా పరిగణిస్తోందని పేర్కొన్న వాంగ్‌.. చైనా ఇప్పటివరకు 10 ఆసియన్‌ దేశాలకు 190 మిలియన్లకుపైగా కొవిడ్‌ టీకాలను అందించినట్లు తెలిపారు. చైనా, ఆసియన్‌ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల సహకారానికి సంబంధించి ఈ సంవత్సరం ప్రథమార్థంలో ద్వైపాక్షిక వాణిజ్యం 410 బిలియన్‌ డాలర్లు దాటిందని వాంగ్‌ నొక్కి చెప్పారు. సంవత్సరానికి ఈ వాణిజ్యం 38.2 శాతం పెరిగిందన్నారు. ఆసియన్‌ దేశాలకు చైనా అతిపెద్ద భాగస్వామిగా 310 బిలియన్‌ డాలర్లు కనీస పెట్టుబడిగా నమోదైందన్నారు. ఆసియా దేశాల్లో కొవిడ్‌ నియంత్రణ కోసం టీకాలతో పాటు ఇతర అత్యావసరాలను సమకూర్చేందుకు చైనా తన వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. శాస్త్రీయ సమస్యలను రాజకీయం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి ఆసియన్‌ దేశాలతో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. ప్రాంతీయ సహకారంలో ఆసియా దేశాలకు చైనా గట్టి మద్దతు ఇస్తుందన్నారు. ఆసియా కేంద్రీకరణను బలహీనపరచే ఏ సహకారాన్ని చైనా ఆమోదించలేదన్నారు. దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించాలని వాంగ్‌ పిలుపునిచ్చారు. సంప్రదింపులు, చర్చల ద్వారా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని చైనా వెల్లడిరచింది. ఉద్రిక్తతలు, విభేదాలను పెంచే ఏకపక్ష చర్యలకు దూరంగా ఆచరణాత్మక సహకారాన్ని పెంచుతామని తెలిపింది. ఆసియాన్‌ విదేశాంగ మంత్రులు చైనా హేతుబద్ధమైన, తెలివైన, విశ్వసనీయమైన శక్తిగా పేర్కొన్నారు. అంతర్జాతీయ న్యాయాన్ని కాపాడటానికి ఏ శక్తికి భయపడదని, ఆసియా దేశాలకు గొప్ప అవకాశాలను అందిస్తుందని అన్నారు. ఆసియాన్‌ ప్రాంతీయ ఆర్థిక సమైక్యత ప్రోత్సాహకానికి, ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వం, భద్రతను సంయుక్తంగా కాపాడటానికి చైనా సిద్ధంగా ఉందని వాంగ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img