Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

చైనా`ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం : జిన్‌పింగ్‌

బీజింగ్‌ : చైనా`ఈయూ మధ్య వ్యూహాత్మక సమాచార ప్రసారాన్ని బలోపేతం చేయడం, ఆరోగ్యకరమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మిచెల్‌తో జరిగిన ఫోన్‌ సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా, ఈయూ రెండూ స్వతంత్ర శక్తులు, సమగ్ర వ్యూహాత్మక భాగస్వాములని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి అంతర్జాతీయ పరిస్థితుల్లో నూతన మార్పులు వచ్చాయని తమ మధ్య సంబంధాóల్లో కూడా కొత్త సమస్యలను ఎదుర్కొన్నామని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. రెండిరటి మధ్య పరస్పర సహకారం, గౌరవం, పరస్పర ప్రయోజనానికి కట్టుబడి ఉండాలని నొక్కి చెప్పారు. రెండువైపులా విధాన పరమైన కమ్యూనికేషన్‌, ఆచరణాత్మక సహకారం మరింతగా విస్తరించాలని, బెల్ట్‌ అండ్‌రోడ్‌ ఇనిషి యేటివ్‌, వాతావరణ మార్పు, జీవవైవిధ్య పరిరక్షణ వంటి సమస్యలపై కమ్యూనికేషన్‌, సహాకారాన్ని బలోపేతం చేయాలని జిన్‌పింగ్‌ సూచించారు. ఈయూ దాని సభ్యులు గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ ఇనిషి యేటివ్‌లో చురుకుగా పాల్గొనేందుకు ఆహ్వానించడ మైంది. చైనా, ఈయూ చరిత్ర, సంస్కతి, సామాజిక వ్యవస్థలు, అభివృద్ధి దశలలో విభిన్నంగా ఉన్నాయని పేర్కొన్న జిన్‌పింగ్‌ పోటీ, వివాదాలు, విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. చైనా, ఈయూతో సంబంధాలను వృద్ధి చేసుకోవడంలో నిజాయితీగా ఉండాలని అదే సమయంలో సార్వభౌమ త్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడు కోవండలో దృఢసంకల్పం ఉండాలన్నారు. చైనా ఈయూ సహకార అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఈయూ చైనాతో కలిసి పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా విభిన్న రాజకీయ వ్యవస్థలు, అభి వృద్ధి నమూనాలను కలిగిఉన్నప్పటికీ రెండూ బహు పాక్షిక తకు మద్దతు ఇస్తున్నాయన్నారు. ఆర్థిక పునరు ద్ధరణను ప్రోత్సహించడంలో, వాతావరణ మార్పులను పరిష్కరించడంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని కాపాడడంలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. చైనా అఫ్గాన్‌ సార్వభౌమత్వాన్ని, స్వాతం త్య్రం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తుందన్నారు. అఫ్గాన్‌ సమస్యను రాజకీయంగా పరిష్కరించుకోవ డంలో చైనా నిర్మాణా త్మక పాత్ర పోషిస్తుందని, అఫ్గాన్‌ శాంతియుత పునర్ని ర్మాణంకోసం అంతర్జాతీయ సమాజం అనుకూల మైన వాతావరణాన్ని సృష్టించాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img