Friday, April 26, 2024
Friday, April 26, 2024

జర్మనీ ఛాన్సలర్‌కు..రెండు వేర్వేరు టీకాలు

బెర్లిన్‌: జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మర్కెల్‌ రెండు వేర్వేరు కొవిడ్‌ టీకాలు వేయించుకున్నారు. ఆమె మొదటి డోస్‌లో భాగంగా ఆస్ట్రాజెనికా టీకా వాడగా రెండవ డోసుగా మోడర్న టీకా తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనికా టీకా మొదటి డోసు తీసుకున్నారు. రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. నిపుణులు మాత్రం రెండు వేర్వేరు టీకాలు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వైద్య సిబ్బంది తప్పిదం వల్ల మన దేశంలో అక్కడక్కడా రెండు వేర్వేరు కొవిడ్‌ టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. మూడేళ్ల క్రితం ఏంజెలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆమెకు ఉన్నట్లుండి కళ్లు తిరగడంతో వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె తిరిగి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 16ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మెర్కెల్‌ ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. రెండు వారాల నుంచి జర్మనీలో వాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img