Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఖషోగ్గి హంతకులకు అమెరికాలో శిక్షణ…!

వాషింగ్టన్‌ : వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక కాలమిస్టు జమాల్‌ ఖషోగ్గి హంతకులు అమెరికాలోనే శిక్షణ పొందినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడిరచింది. అమెరికాలోని టైర్‌ 1గ్రూపు అనే ప్రైవేటు భద్రతా సంస్థ 2014 నుంచి పారామిలిటరీలో శిక్షణ నిచ్చింది. ఈ శిక్షణ ట్రంప్‌ హయాం వరకు కొనసాగింది. టైర్‌ 1 గ్రూపు సంస్థకు మాతృసంస్థ అయిన సెర్బరస్‌ కాపిటల్‌ మేనేజిమెంటు సంస్థ లోని లూయిస్‌ బెర్మర్‌ అనే అత్యున్నత అధికారి పెంటగన్‌లో ఉద్యోగం కోసం ఈ సంస్థకు చెందిన శిక్షణా పత్రాలు సమర్పించారు. ఇప్పుడు అవి వెలుగులోకి రావడంతో అసలు విషయం బైట పడిరది. టైర్‌ 1 గ్రూపు ఆత్మరక్షణకు మాత్రమే శిక్షణ ఇచ్చిందని ఆయన వివరించారు. ఆ హంతకులు చేసిన పనితో సంబంధం లేదని పేర్కొన్నారు. లూయిస్‌ కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు 2014`15 వరకు, ఆ ఇద్దరితో పాటు మరో ఇద్దరువచ్చి 2017వరకు శిక్షణ పొందినట్లు పేర్కొన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో గల సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంలో 2018లో ఖషోగ్గి దారుణహత్యకు గురయ్యారు. ఖషోగ్గి వాషింగ్టన్‌పోస్టు కాలమిస్టు. ఆయన సౌదీ రాజ కుటుంబానికి సన్నిహితుడు. ఆ తర్వాత వారిని వ్యతిరేకిస్తూ అమెరికా వెళ్లి అక్కడ నుంచి సౌదీ రాజకుటుంబంపై కథనాలు రాసేవాడు. ఈ హత్యవెనుక సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img