Friday, April 26, 2024
Friday, April 26, 2024

ట్యునీషియా అధ్యక్షుడికి మద్దతుగా భారీ ప్రదర్శన


ట్యునిస్‌ : ఆఫ్రికా ఖండ దేశమైన ట్యునీ షియా అధ్యక్షుడు కైస్‌ సయీద్‌కు మద్దతు తెలియ జేస్తూ రాజధానిలో వందలాదిమంది ట్యునీషి యన్లు ఆదివారం భారీ ప్రదర్శన చేపట్టారు. రాజకీయ వ్యవస్థను మారుస్తానని వాగ్దానం చేసినందుకుగాను తమ మద్దతును ప్రకటించారు. జాతీయ జెండాలు చేపట్టి వీధుల్లో ప్రదర్శన చేశారు. పార్లమెంటులో అతి పెద్దదైన ముస్లిం డెమొక్రటిక్‌పార్టీకి చెందిన ఎన్నాహ్దాకు వ్యతి రేకంగా నినదించారు. ప్రస్తుత సంక్షోభం నుండి దేశాన్ని నడిపించే ఏకైక వ్యక్తికి సయీద్‌గా అభివర్ణించారు. రాజ్యాంగాన్ని సవరించాలని కోరుతూ ప్రజలు పార్లమెంటును రద్దు చేయా లనుకుంటున్నారు వంటి నినాదాలు చేశారు. పాపులర్‌ మూవ్‌మెంట్‌, అలయన్స్‌ ఫర్‌ ట్యునీ షియా, పాపులర్‌ కరెంట్‌తో సహా అనేక రాజకీయ పార్టీలు అధ్యక్షుడికు మద్దతుగా ఈ ప్రదర్శ నలో పాల్గొన్నాయి. ట్యునీషియా సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కోవిడ్‌`19 మహమ్మారి కారణంగా ట్యునీషియా ఆర్థికంగా దిగజారింది. జులై 25న అధ్య క్షుడు సయీద్‌ ప్రధానిని పదవినుంచి తొలగించినట్లు ప్రకటించడంతోపాటు ట్యునీషియా పార్ల మెంటును రద్దుచేసినట్లు ప్రకటించడంతో ప్రతిపక్షాలనుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ రోజు చారిత్రక రోజు మోజారిటీ ప్రజలు అధ్యక్షుడుకు మద్దతు పలుకుతున్నారని యవత కోసం వారి భవిష్యత్తుకోసం ఈ ప్రదర్శన చేపట్టినట్లు కైస్‌ మద్దతుదారు పేర్కొన్నారు. మేము పార్లమెంటుకు వ్యతిరేకం..కైస్‌తో ఉన్నామని అమర్‌ అనే ప్రభుత్వ రంగ ఉద్యోగి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img