Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తాలిబన్ల ఆక్రమణలో అఫ్గాన్‌

కీలక నగరాలు సహా18 రాష్ట్రాలపై నియంత్రణ
వారం రోజుల్లో దేశం మొత్తాన్ని ఆక్రమిస్తామని ప్రకటన
అధికారం పంచుకోడానికి అఫ్గాన్‌ ప్రభుత్వం సిద్ధం

కాబూల్‌ : అఫ్గాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. మరో మూడు కీలక నగరాలను ఆక్రమించారు. మెరుపు వేగంతో కాబుల్‌ వైపు దూసుకెళ్తున్నారు. వారం రోజుల్లోగా రాజధా నిని స్వాధీనం చేసుంటామని చెబుతున్నారు. హింసాత్మక పద్ధతుల్లో బుధవారం బదఖ్షాన్‌, బఘ్లాన్‌, ఫరాప్‌ా రాష్ట్రాలను ఆక్రమించిన తాలిబన్లు, గురువారం గాజ్నీ, హేరత్‌, శుక్రవారం లష్కర్‌ గాప్‌ా (హెల్మండ్‌ రాజధాని), ఉరుగ్జాన్‌ రాష్ట్రాలను, అత్యంత కీలకమైన కాందహార్‌ను హస్తగతం చేసుకున్నారు. 72 గంటల్లోనే ఎనిమిది కీలక నగరాలను మూకలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఫలితంగా 34 రాష్ట్రాలు ఉన్న అఫ్గాన్‌లో.. 18 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల వశమయ్యాయి.
దేశవ్యాప్తంగా మూడిరట రెండొంతుల కంటే ఎక్కువ ప్రాంతాలు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. దేశ దక్షిణభాగం మొత్తం ఇప్పుడు వారి చేతుల్లోనే ఉంది. ఘాజ్నీ, లోగర్‌ వంటి నగరాలను కోల్పోవడం అఫ్గాన్‌ దళాలకు గట్టి ఎదురు దెబ్బేనని పరిశీలకులు చెబుతున్నారు. కాబుల్‌` కాందహార్‌ హైవేలో ఉన్న ఘాజ్నీ నగరం.. దేశ రాజధానిని, దక్షిణాది రాష్ట్రాలను కలుపుతుంది. ఈ నగరం తాలిబన్ల పరం కావడం వల్ల అఫ్గాన్‌ సైనికుల రవాణాకు ఆటంకం ఏర్పడనుంది. ఇక లోగర్‌ కాబూల్‌కు కేవలం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇప్పటివరకు తాలిబన్లు కాబూల్‌ను నేరుగా లక్ష్యంగా చేసుకోకపోయినా ఆ నగరానికి చుట్టు పక్కల ప్రాంతాల్లో కి చొచ్చుకురావడంతో ఇంచు మించుగా కాబూల్‌ ముట్టడి జరిగే పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు దేశంలో హింసను అదుపు చేసేందుకు తాలిబన్లతో అధికారాన్ని పంచుకోవడానికి అఫ్గాన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. హింసను పక్కనబెడితే అధికారాన్ని పంచుకోవ డానికి అభ్యంతరంలేదన్న ప్రదిపాదనను వారికి తెలియ జేసింది. ఈ మేరకు ఖతార్‌లోని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతి నిధులు తాలిబన్ల ముందు ప్రతిపాదన ఉంచినట్లు విశ్వస నీయ వర్గాలు తెలిపాయి. దేశంలో శాంతిని నెలకొల్పే ఉద్దే శంతో మధ్యవర్తిగా ఉన్న ఖతార్‌ వద్ద తన ప్రతిపాదనను ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అఫ్గాని స్థాన్‌లోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని కీలక ప్రాంతాలు ఇప్పటికే తాలిబన్ల వశమైన నేపథ్యంలో కాబూల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా దళాల ఉపసంహరణ చివరి దశకు చేరుకున్న తరుణంలో అఫ్గాన్‌లో చాలా ప్రాంతం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపో యింది. కాబూల్‌కు ఇప్పటికిప్పుడు ముప్పు లేనప్పటికీ తాలి బన్లు పుంజుకుంటున్న తీరు చూస్తుంటే రాను రాను పరిస్థి తులు మరింత కఠినంగా మారతాయని, కాబూల్‌ 30 రోజుల్లో తిరుగుబాటుదారుల ఒత్తిడికి గురవుతుందని అమెరికా మిలిటరీ ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి కొనసాగితే, కొన్ని నెలల్లోనే తాలిబాన్‌ దేశంపై పూర్తి నియంత్రణ సాధించవచ్చునని పేర్కొన్నాయి. మరోవైపు, కాబుల్‌ రాయబార కార్యాలయంలో పనిచేసే తమ దేశ సిబ్బందిని అఫ్గాన్‌ నుంచి తరలించేందుకు మూడు వేల బలగాలను అమెరికా పంపిస్తోంది. అదే సమయంలో, నగరాల్లో దాడులు ఆపాలని, రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించాలని తాలిబన్లకు హితవు పలికింది. హింస ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అఫ్గాన్‌ను బహిష్కరిస్తామని, అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తామని హెచ్చరించింది. ఇదిలా వుండగా బలప్రయోగం ద్వారా ఏర్పడిన అఫ్గాన్‌ సర్కారును గుర్తించబోమంటూ అమెరికా, భారత్‌, చైనా సహా 12 దేశాలు తీర్మానించుకున్నాయి. ఖతార్‌, ఉజ్బెకిస్థాన్‌, పాకి స్థాన్‌, యూకే, ఈయూ, జర్మనీ, నార్వే, తజకిస్థాన్‌, టర్కీ, తుర్కమెనిస్థాన్‌ దేశాలదీ ఇదే వైఖరి. ఇక మిగిలిన దేశాలు అఫ్గాన్‌లోని తమ పౌరులు, సిబ్బందిని వెనక్కి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్రిటన్‌ 600 మంది సైనికులను పంపిస్తోంది. తమ పౌరులను సురక్షితంగా అఫ్గాన్‌ దాటించేందుకు వీరిని పంపుతోంది.రాయబార కార్యాలయ సిబ్బందిని తరలించేందుకు కెనడా ప్రత్యేక దళాలను పంపు తోంది. కాబుల్‌లో ఎంబసీని ఇదివరకే మూసే సిన ఆస్ట్రేలియా.. తమ దేశం కోసం పనిచేసిన అఫ్గాన్‌ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తోంది. తమకు సహకరించిన ప్రతి ఒక్క అఫ్గాన్‌ పౌరుడిని కాపాడతామని తెలిపింది. కాగా అఫ్గానిస్థాన్‌ ఉపాధ్యక్షుడు తజకిస్థాన్‌కు పారిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. హెల్మాండ్‌లోని ప్రాంతీయ మండలి కౌన్సిల్‌ అధిపతి అట్టావుల్లా అఫ్గాన్‌ మాట్లాడుతూ.. భీకర పోరాటాల తర్వాత తాలిబన్లు ప్రాంతీయ రాజధాని లష్కర్‌ గాప్‌ా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. కాగా లష్కర్‌ గాప్‌ా వెలుపల ఉన్న మూడు జాతీయ సైనిక స్థావరాలు ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img