Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నోబెల్‌ శాంతి పురస్కారానికి 305 నామినేషన్లు ` ఆరేళ్లలో కనిష్ఠం

కోపెన్‌హేగన్‌: నోబెల్‌ శాంతి పురస్కారానికి సంబంధించి 305 నామినేషన్లు వచ్చినట్లు నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ తెలిపింది. ఈ ఏడాది శాంతి పురస్కారం కోసం నామినేషన్ల గడువు ఫిబ్రవరి ఒకటవ తేదీతో ముగిసింది. దీంతో 305 నామినేషన్లు వచ్చాయని కమిటీ ప్రకటించింది. అయితే ఇది నాలుగేళ్లలో కనిష్ఠమని కూడా పేర్కొంది. 93 సంస్థలకు చెందిన 212 మంది పేర్లను విడుదల చేయలేదని వెల్లడిరచింది. గతేడాది 343 మంది నామినేట్‌ వచ్చాయని, ఎనిమిదేళ్లుగా ఏటా 300కుపైగా నామినేషన్లు వస్తున్నాయని, 2019 తర్వాత 2023లో తక్కువ మంది నామినేట్‌ అయినట్లు ప్రకటన తెలిపింది. 2016లో 376 నామినేషన్లు వచ్చినట్లు గుర్తుచేసింది. నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ అయ్యేది ఎవరన్నది రహస్యంగా ఉంటుంది. 50ఏళ్లుగా ఈ ప్రక్రియ గోప్యంగా సాగుతోందని ప్రకటన పేర్కొంది. విస్తృత బృందాలు, జాతీయ, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు, నోబెల్‌ శాంతి పురస్కారగ్రహీతలు నామినేషన్లు దాఖలు చేస్తుండగా, ప్రచారం కోసం దాన్ని వారు బహిర్గతం చేస్తుంటారు. ఈసారి నార్వేలో గ్రీన్‌పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు లాన్‌మారీ న్యూయెన్‌బర్గ్‌ ఇద్దరు వాతావరణ పరిరక్షకులు… స్వీడెన్‌కు చెందిన గ్రేటా థన్‌బర్గ్‌, ఉగాండాకు చెందిన వనెస్సా నకాటెను నామినేట్‌ చేశారు. గ్రేటా గతేడాదితో కలిపి ఇప్పటివరకు నాలుగుసార్లు నామినేటయ్యారు. ఓస్లోలోని శాంతి పరిశోధన సంస్థ సంచాలకుడు హెన్రిక్‌ ఉర్దాల్‌ మానవ హక్కుల పరిరక్షకులు… ఇరాన్‌కు చెందిన నర్గీస్‌ మహమ్మదీ, అఫ్గానిస్తాన్‌కు చెందిన మెహబూబా సిరాజ్‌, అమెరికాలో మయన్మార్‌ ప్రతినిధి క్వావ్‌ మో తున్‌ను నామినేట్‌ చేశారు. కాగా, నోబెల్‌ పురస్కార విజేతలను అక్టోబరులో ప్రకటిస్తారు. డిసెంబరు 10న (నోబెల్‌ వర్థంతి) అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. అవార్డు రూపేణ విజేతలకు స్వర్ణపతకం, పది మిలియన్‌ స్వీడిష్‌ క్రోనోర్‌ (మిలియన్‌ డాలర్లు) నగదు అందజేస్తారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img