Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ధి ప్రధాన లక్ష్యం : జిన్‌పింగ్‌

బీజింగ్‌ : వాతావరణ మార్పులు, ఇంధన సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జి20 సమా వేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపు నిచ్చారు. రోమ్‌లో రెండు రోజులు జరిగిన 16వ జి20 సమావేశంలో వీడియో లింక్‌ ద్వారా జిన్‌పింగ్‌ ప్రసంగించారు. పర్యావరణ పరి రక్షణ, ఆర్థిక అభివృద్ధిని సమతుల్యం చేయాలని, సహకారాన్ని బలోపేతం చేయాలని, వాతావరణ మార్పులను పరిష్కరించాలని, ప్రజల జీవనోపా ధిని కాపాడాలని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. పారిస్‌ పర్యావరణ ఒప్పందంపై ఐక్యరాజ్యసమితి నిర్ణయాన్ని అమలు చేయాలని అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలని సభ్య దేశాలకు సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు, అభివృద్ధి చెందిన దేశాలు తమ మద్దతును, సహకారాన్ని బలోపేతం చేయాలన్నారు. 15 సంవత్సరాల్లో చైనా కర్బన ఉద్గారాల తగ్గింపులో 2020 వాతావరణ కార్యాచరణ లక్ష్యాలను సాధించిందని జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. కోవిడ్‌`19 మహమ్మారి కారణంగా అంతర్జాతీ యంగా సంవత్సరాలుగా సాధించిన అభివృద్ధి విజయాలు క్షీణించాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలు వివిధ సవాళ్లు, పరీక్షలను ఎదుర్కొం టున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు ప్రాముఖ్యత నివ్వాలని పేదరికం తగ్గింపు, ఆహారభద్రత, పారిశ్రామికీకరణ వంటి క్లిష్టమైన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలన్నారు. ఆచరణాత్మక సహకా రాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అభివృద్ధికోసం భాగస్వామ్య భవిష్యత్తుతో కూడిన ప్రపంచ సమాజాన్ని నిర్మించడంలో అన్ని పక్షాలు ఐక్యరాజ్యసమితికి మద్దతు నివ్వాలని జిన్‌పింగ్‌ కాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img