Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపుపై దృష్టి

బాగ్దాద్‌ : మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం లక్ష్యంగా ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో శనివారం ప్రాంతీయ దేశాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరాన్‌, సౌదీ అరేబియాలతో పాటు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్‌ఫత్తా అరబ్‌ లీగ్‌సెక్రటరీ జనరల్‌ అహ్మద్‌ అబౌబ్‌ గీత్‌, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ పాల్గొన్నారు. ప్రాంతీయ నీటి సంక్షోభం, ఆఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం, కాబూల్‌ దాడి, యెమెన్‌లో యుద్ధం, లెబనాన్‌లో తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం వంటి కీలక పరిస్థితులపై చర్చించారు. ఈనేపధ్యంలో ఖతార్‌ ఎమిర్‌ షేక్‌ హాజరయ్యారు. ఖతార్‌ నాయకుడు ఇరాక్‌లో చేపట్టిన మొదటి అధికారిక పర్యటన ఇది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రాంతీయ ప్రత్యర్థులు సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య అనేక దఫాలుగా ప్రత్యక్ష చర్చలు జరిగాయి. సౌదీ అరేబియా టెహ్రాన్‌లో తన రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచే అవకాశల గురించి చర్చించింది. సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వంటి అరబ్‌ గల్ప్‌ దేశాలు అమెరికా, ఇరాన్‌ మధ్య అణు ఒప్పందానికి మద్దతు పలికాయి. యెమెన్‌లో అనేక సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తున్న ఇరాన్‌తో చర్చలు కొనసాగించాలని ఈ సమావేశం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img