Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మన ప్రపంచం.. మన భవిష్యత్తు.. సోషలిజం

స్లొవేనియా : దక్షిణ యూరోపియన్‌ దేశమైన స్లొవేనియాలో కమ్యూనిస్టు వ్యతిరేక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించనుండటంపై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ (కేకేఈ), కమ్యూనిస్టు యూత్‌ (కేఎన్‌ఇ) సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని స్లోవేనియన్‌ రాయబార కార్యాలయం ముందు కేకేఈ, కేఎన్‌ఈ సభ్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ‘బాధితుల జ్ఞాపకార్థం’ అనే పేరుతో నిర్వహించనున్న ఈ సమావేశాన్ని స్లొవేనియా ప్రభుత్వ నిరంకుశపాలనగా పరిగణించారు. ఆగస్టు 23న నిర్వహించే ఈ సమావేశం పియస్టా పాలనలో జరిగే చారిత్రక వ్యతిరేక పోరాటంగా పేర్కొన్నారు.
కమ్యూనిజాన్ని నాజీయిజంతో పోల్చే ఈ సమావేశం కమ్యూనిస్టులను రెచ్చగొట్టే చర్య అని అన్నారు. ‘మన భవిష్యత్తు పెట్టుబడీదారీ విధానం కాదు. నూతన ప్రపంచం.. అదే సోషలిజం’ కమ్యూనిస్టు వ్యతిరేక విధానాలు ఇకపై చెల్లవు.. ప్రజలు పోరాటం ద్వారానే కమ్యూనిజాన్ని సాధిస్తారు’ వంటి నినాదాలతో నిరసనకారులు ప్లకార్డులు చేపట్టారు. కెఎన్‌ఈ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యుడు కెకెఇ ఎమ్‌ఈపీ వామపక్షవాది నికోలౌ, అలవనోస్‌, మాగ్దా రిగానేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం స్లోవేనియన్‌ రాయబారి మాట్టాస్‌ లాంగంకు తీర్మానాన్ని సమర్పించారు. స్లోవేనియన్‌ ప్రెసిడెన్సీ చేపట్టిన ఆమోదయోగ్యం కాని నిర్ణయాన్ని ఈయూ తీవ్రంగా ఖండిరచింది. కమ్యూనిస్టు వ్యతిరేక అంతర్జాతీయ సమావేశాన్ని నిరంకుశ పాలనలో ప్రజలు ప్రధాన బాధితులుగా అభివర్ణించింది. సంక్షోభాలు, బాధలు, యుద్ధాలు, దోపిడీ సృష్టించే దోపిడీ వ్యవస్థను నిర్మూలించేదుకు, కార్మికుల`ప్రజల అవసరాలను సంతృప్తి పరచే ప్రపంచాన్ని నిర్మించేందుకు ప్రజలకు అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశం ఐరోపా ప్రజలను రెచ్చగొట్టే అగౌరవమైన చర్యగా పేర్కొంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img