Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మలేరియా వాక్సిన్‌కు డబ్ల్యుహెచ్‌ఓ ఆమోదం

జెనీవా, స్విట్జర్లాండ్‌ : ప్రపంచంలో మొట్టమొదటి మలేరియా వాక్సిన్‌ (ఆర్టీఎస్‌, ఎస్‌/ఏఎస్‌01)కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) బుధవారం ఆమోదం తెలిపింది. దీనిని మొదటి జీఎస్‌కే ఔషధ కంపెనీ 1987లో తయారుచేసింది. ఈ వాక్సిన్‌ను మలేరియా ఎక్కువగా ప్రబలుతున్న ఆఫ్రికన్‌ దేశాల నుంచి ప్రారంభించేందుకు సంకల్పించింది. ఆఫ్రికన్‌ దేశాల్లో సంవత్సరానికి మలేరియా కారణంగా 400,000 మందికి పైగా మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఒక బిడ్డ మలేరియా మరణిస్తునన్నట్లు అంచనా.. 2019లో ఈ వాక్సిన్‌ను ఘనా, కెన్యా, మలావి ప్రాంతాల్లో అమలుచేసిన పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద దాదాపు 23లక్షల మంది చిన్నారులకు టీకాలు ఇచ్చినట్లు డబ్ల్యుహెచ్‌ఓ ఆఫ్రికా ప్రాంతీయ డైరెక్టర్‌ తెలిపారు. మలేరియా సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, చెమటలు పట్టడం వంటివి సాధారణ లక్షణాలుగా గుర్తించవచ్చు. ఈ టీకా ఇచ్చిన పిల్లలో మూడిరట రెండు వంతుల మంది దోమతెరలు లేనివారే ఉన్నారు. ఈ వాక్సిన్‌ ద్వారా 30శాతం కేసులను నిరోధించవచ్చు. సబ్‌సహారా ఆఫ్రికా, ఇతర ప్రాంతాల్లో మలేరియా సోకిన ప్రాంతాల్లోని పిల్లలకు రెండు సంవత్సరాల వరకు నాలుగు డోసులు అందించాలని డబ్ల్యుహెచ్‌ఓ నిర్ణయించింది. వాక్సిన్‌ విజయవంతం కావడంతో ఉత్పత్తి చేసే నిధుల సమీకరణపై దృష్టి పెట్టనుంది. ఈ టీకా అవసరమైన ప్రతి దేశానికి చేరాలన్న డబ్ల్యుహెచ్‌ఓ కల సాకారం కానుంది. మలేరియాను నియంత్రించే చర్యల్లో ఈ టీకానుచేర్చడంపై ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన నిర్ణయం తీసుకుంటాయి. భారత్‌నుంచి ఏటా 3లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
2019లో మలేరియా కారణంగా 4.09 లక్షలమంది మరణించారు. ఇందులో 67శాతం చిన్నారులే..ప్రపంచవ్యాప్తంగా 2019 నంచి 8లక్షలమంది పైగా పిల్లలు మలేరియాకు గురయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img