Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రష్యాకు 40 వేల ఈజిప్టు రాకెట్లు?

కైరో: ఉక్రెయిన్‌పై యుద్ధం క్రమంలో రష్యాకు ఈజిప్టు 40 వేల రాకెట్లను రహస్యంగా పంపనున్నట్లు అమెరికా నిఘా నివేదికలు చెబుతున్నట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడిరచింది. ఈజిప్టు సైనిక ఉన్నతాధికారులతో సమావేశమైన ఆ దేశాధ్యక్షుడు అబ్దేల్‌ ఫతాప్‌ా ఎల్‌-సిసీ, ఆర్టిలరీ రౌండ్లు, గౌన్‌ పౌడర్‌ను రష్యాకు సరఫరా చేయడంపై చర్చించినట్టు పేర్కొంది. పశ్చిమ దేశాల నుంచి ఎటువంటి సమస్య లేకుండా రష్యాకు ఆయుధాల తరలింపు పక్కా ప్రణాళికతో జరగాలని అధికారులను ఆదేశించినట్టు వార్తా నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 17 నాటి అమెరికా నిఘా వర్గాల నివేదికలో ఈ విషయం ఉన్నట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ తెలిపింది. ఈ పరిణామం అమెరికా అధికారులను, రాజకీయ నాయకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘సిసీ రహస్యంగా రష్యా కోసం ఉక్రెయిన్‌లో ఉపయోగించగల రాకెట్లను నిర్మిస్తున్నది నిజమైతే, రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది’ అని కనిక్టికట్‌ జూనియర్‌ సెనేటర్‌ క్రిస్‌ ముర్ఫీ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పందిస్తూ పత్రాల చెల్లుబాటును నిర్ధారించడానికి నిరాకరించారని ఫాక్స్‌న్యూస్‌ తెలిపింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో మిత్రదేశాలలో ఒకటైన ఈజిప్టుతో అమెరికా సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ జనవరి చివరలో కైరోలో ఎల్‌-సిసీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌`రష్యా యుద్ధం వల్ల ఆర్థికంగా ప్రభావితమైన ఈజిప్టుకు అమెరికా తరపున బ్లింకేన్‌ సంఫీుభావం తెలిపారని చెప్పింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గతేడాది నవంబరులో ఈజిప్టు పర్యటనకు వెళ్లి ఎల్‌-సిసీతో భేటీ అయ్యారు. గతంలో మాస్కో చేసిన సాయానికి రుణం తీర్చుకోవాలని రష్యాకు సహాయం చేయాలని ఈజిప్టు నిర్ణయించినట్టు సైనిక ఉత్పత్తి విభాగం సహాయ మంత్రి మహమ్మద్‌ సలా అల్‌-దిన్‌ చెప్పినట్టు ఓ అధికారి వెల్లడిరచారు. కాగా యుద్ధం కారణంగా ఈజిప్టు రష్యన్‌ గోధుమలపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు రాయిటర్స్‌ వార్తాసంస్థ నివేదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img