Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రష్యా విమాన ప్రయాణీకులు సురక్షితమే…

మాస్కో : రష్యా ప్యాసింజర్‌ విమానం ఏఎన్‌28లో ప్రయాణిస్తున్న వారందరూ సైబీరియన్‌ నగరమైన టామ్స్క్‌ వెలుపల ప్రాంతంలో బతికి బైటపడ్డారు. ఆంటోనోవ్‌28 విమానం కెడ్రోవ్‌ పట్టణం నుండి టామ్స్క్‌ వెళ్లే మార్గంలో రాడార్లతో సంబంధాలు తెగిపోయినట్లు రష్యన్‌ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. విమానం కోసం వెతకడానికి రెండు హెలికాప్టర్లు పంపడంతో మొత్తం 19మంది ప్రయాణీకులు సజీవంగా ఉన్నట్లు నిర్థారించారు. ప్రాంతీయ వైమానిక సంస్థ సిలా నడుపుతున్న ఈ విమానం రెండు ఇంజిన్లలో ఒకటి విఫలం కావడంతో బలవంతంగా టామ్స్క్‌ వద్ద ల్యాండిరగ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. విమానం అదృశ్యమయే ముందు విమానం సిబ్బంది ఎటువంటి సమస్యలను వెల్లడిరచలేదు. అయితే ఇది కూలిపోయి ఉండవచ్చునన్న సంకేతాలు వెలువడ్డాయి. ఆంటోనోవ్‌`28 అనేది సోవియట్‌ రూపొందించిన టర్బోప్రాప్‌. విమానం తప్పిపోయిన సమయంలో ఈ ప్రాంతంలో వాతావరణం మేఘావృతమై ఉందని రష్యా వార్తా సంస్తలు నివేదించాయి. ఈ విమానం 1982 నండి సేవలందిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img