Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మా దేశంలోకి 10 వేలమంది జిహాదీ ఫైటర్లు పంపింది.. పాకిస్థాన్‌ : ఆఫ్ఘన్‌ ప్రకటన

కాబూల్‌ : తమ దేశంలోని పది వేల మందికిపైగా జిహాదీ ఫైటర్లు గతనెలలో ప్రవేశించారని, వీరిని పాకిస్థాన్‌ పంపిందని ఆఫ్ఘనిస్థాన్‌ ప్రకటించింది. తాలిబన్లకు పాకిస్థాన్‌ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం మద్దతు ఇస్తున్నట్లు ఆఫ్ఘన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘని ఆరోపించారు. శాంతి చర్చల్లో తాలిబన్లు చురుకుగా పాల్గొనేలా వారికి పాక్‌ నచ్చజెప్పడంలేదని విమర్శించారు. తాష్కెంట్‌లో జరిగిన కేంద్ర, దక్షిణాసియా కనెక్టివిటీ సదస్సులో ఘని మాట్లాడుతూ, ఆఫ్ఘన్‌లో తాలిబన్లు ఏ ప్రాంతాన్నీ ఆక్రమించుకోలేదని పాక్‌ చెబుతోంది. అసలు అలా జరగకుండా చూస్తామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, ఆయన ఆధీనంలోని సైన్యం ఇస్తున్న హామీలు వట్టి నీటి బుడగలుగా మారిపోతున్నాయన్నారు. దేశంలో తాలిబన్లు, వారి నెట్వర్క్‌లు, సంస్థలు వివిధ ప్రాంతాలను ఆక్రమించుకుని ఆస్తులను ధ్వంసం చేస్తూ వేడుకలు చేసుకుంటున్నారని విరుచుకుపడ్డారు. సమస్యకు రాజకీయ పరిష్కారమొక్కటే మార్గమని గుర్తించేంతవరకు వారిని ప్రతిఘటిస్తూనే ఉంటామని చెప్పారు. కాందహార్‌లో స్పిన్‌ బోల్టన్‌ జిల్లాను, ఇతర ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తాలిబన్లను టార్గెట్‌ చేసిన పక్షంలో ఆఫ్ఘన్‌ వైమానిక దళంపై మిసైళ్లు ప్రయోగిస్తామని పాక్‌ సైన్యం హెచ్చరించిందని ఆఫ్ఘన్‌ ఉపాధ్యక్షుడు అమాతుల్లా సొహేల్‌ ఆరోపించారు.
పాకిస్థాన్‌ ఖండన : ఆఫ్ఘన్‌ ఆరోపణలను పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ఖండిరచింది. నిరాధార ఆరోపణలు చేయడంలో మర్మమేమిటని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img