Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ముహమ్మద్‌ నఫా కన్నుమూత

ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, రచయిత మహమ్మద్‌ నఫా (అబు హిషం) కన్నుమూశారు. కామ్రేడ్‌ నఫా జీవితం ఉద్యమాల్లోనే ఆచరణతత్వంలో గడిచింది. యుద్ధానికి, జాతివివక్షకు, సామ్రాజ్యవాదానికి, వలసవాదానికి వ్యతిరేకంగా ఆయన అనేక పోరాటాలు చేశారు. పాలస్థీనా ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి, ప్రపంచానికి సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించారు. కామేడ్‌ నఫా మరణం పార్టీకి తీరని లోటు అని ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ, కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సంతాపాన్ని ప్రకటించాయి. మహమ్మద్‌ నఫా 1939, మే 14న గల్లిలీ గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే ఉద్యమబాట పట్టారు. కామ్రేడ్లతో కలిసి అరబ్‌ డ్రజ్‌ కమ్యూనిటీ తప్పనిసరి సైనిక సేవలకు వ్యతిరేకంగా పోరాడారు. తొలుత యూత్‌ కమ్యూనిస్టు లీగ్‌, ఆపై కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చివరి రోజు వరకు పార్టీలో క్రియాశీల సభ్యునిగా ఉన్నారు. కామ్రేడ్‌ నఫా పార్టీలో అనేక ఉన్నత పదవుల్లో పనిచేశారు. 1980లో వైసీఎల్‌ఐ ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా, 19902000లో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 199092లో పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. హదర్శది డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఫర్‌ పీస్‌ అండ్‌ ఈక్విటికి ప్రాతినిధ్యం వహించారు. కామ్రేడ్‌ అబు హిషం దూరదృష్టి కలిగిన వ్యక్తి అన్ని అంశాలపై స్పష్టమైన విజన్‌తో ముందుకెళ్లేవారు. నిజమైన దేశభక్తుడు. మాక్సిజంలెనినిజం ఆధారంగా పార్టీని నడిపించారు. అల్‌`ఇతిహాద్‌ వార్తాపత్రిక ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్నారు. సృజన్మాతకగల నవలలు, చిన్న కథల రచయితగా ఎందరో పాఠకుల మన్ననలు పొందారు. కామ్రేడ్‌ నఫా జీవితభాగస్వామి కామ్రేడ్‌ నయాఫి తమ కుమారాలను సామాజిక, రాజకీయ సిద్ధాంతాలతోనే పెంచారు. తప్పనిసరిగా సైనిక సేవలను వ్యతిరేకించి జైలు పాలయ్యారు. కామ్రేడ్‌ నఫాకు కమ్యూనిస్టు పార్టీ, హదర్శ, కేడర్లు అంతిమ వీడ్కోలు పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img