Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రొమేనియాతో సైనిక సహకారం : అమెరికా

బుఖారెస్ట్‌ : నల్ల సముద్ర ప్రాంతంలో రొమేనియాతో సైనిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్‌ ఆస్టిన్‌ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. యూరోపియన్‌ దేశమైన రొమేనియా రక్షణమంత్రి సియుకాతో అధికారిక స్వాగత వేడుకలకు ఆస్టిన్‌ హాజరయ్యారు. రొమేనియాలో రొటేషన్‌ ద్వారా దాదాపు 1000 మంది సైనికులను మేము కొనసాగిస్తాం..అని ఆస్టిన్‌ పేర్కొన్నారు. రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్‌, జార్జియా దేశాల్లోని సముద్ర తీర సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు అమెరికా సహాయం అందిస్తూనే ఉంటుందని ఆస్టిన్‌ పేర్కొన్నారు. రొమేనియా అధ్యక్షుడు బయోహన్నీస్‌తో జరిగిన సమావేశంలో ఆస్టిన్‌ రొమేనియాతో సహకారం అభివృద్ధి, వైవిధ్యం కొనసాగించడానికి తన దేశం ఆసక్తి చూపిస్తోందని అన్నారు. నాటో రాజకీయ, సైనిక బలోపేతంతో రొమేనియా వ్యూహాత్మక భాగస్వామిగా విశ్వసనీయ మిత్రదేశంగా కొనసాగుతుందన్నారు. బెల్జియంలో రెండు రోజుల నాటో రక్షణ మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యే ముందు జార్జియా, ఉక్రెయిన్‌తో సహా ఆస్టిన్‌ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆస్టిన్‌ రొమేనియాలో పర్యటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img