Friday, April 26, 2024
Friday, April 26, 2024

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన అఫ్గాన్‌

ముగ్గురు మృతి : 20 మందికి గాయాలు
కాబూల్‌ : వరుస పేలుళ్లతో అఫ్గాన్‌ దద్దరిల్లింది. రాజధాని కాబూల్‌కు 80 మైళ్ల దూరంలోని జలాలాబాద్‌లో తాలిబన్‌ వాహనాలే లక్ష్యంగా పేలుళ్లు సంభవించగా ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. నంగర్‌హార్‌ ప్రావిన్స్‌ రాజధాని జలాలాబాద్‌లోని తాలిబాన్‌ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. తాలిబన్‌ దళాల వాహనాలు వెళుతుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతర పేలిందన్నారు. గాయపడిన 20 మందిని ఆసుపత్రికి తరలించగా వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని చెప్పారు. గాయపడిన వారంతా సామాన్య పౌరులేనని అధికారులు వెల్లడిరచారు. ఈ దాడులకు ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదని, ఇది ఐసిస్‌ పనే అని అనుమానం వ్యక్తంచేశారు. తాలిబన్ల ప్రభుత్వానికి ఐసిస్‌ నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ దాడులను వారే జరిపి ఉండవచ్చునన్నారు. ఇదిలావుంటే, అఫ్గాన్‌ దేశం తాలిబన్ల వశమైనప్పటికీ ఇక్కడ నిత్యం రక్తం చిందుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img