Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం


ఉత్తర కొరియా ప్రకటన
ప్యాంగ్యాంగ్‌ : అణ్వస్త్రాలను మోసుకెళ్లే హైపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. మంగళవారం నిర్వహించిన తొలి పరీక్షలో నిర్దేశిత సాంకేతిక ప్రమాణాలను క్షిపణి అందుకున్నట్లు వెల్లడిరచింది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారిక మీడియా క్షిపణి చిత్రాన్ని విడుదల చేసింది. ఉత్తర కొరియా క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా, జపాన్‌ ఆరోపించిన నేపథ్యంలో కిమ్‌ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. క్షిపణి పరీక్షతో ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా ఇండో- పసిఫిక్‌ కమాండ్‌ తెలిపింది. కానీ ఆయుధాల తయారీపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడిరది. డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ జరిపిన చర్చలు విఫలమైన తర్వాత అగ్రరాజ్యంపై ఉత్తర కొరియా ఆగ్రహంగా ఉంది. మరిన్ని అణ్వాయుధాలను సమకూర్చుకుంటామని ఇప్పటికే కిమ్‌ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img