Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

20న రష్యాకు జిన్‌పింగ్‌పుతిన్‌తో చర్చలు

బీజింగ్‌: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు రష్యాలో పర్యటిస్తారని, ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరుపుతారని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు ఈనెల 2022 తేదీల్లో ఆ దేశంలో జిన్‌పింగ్‌ పర్యటించనున్నారని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునింగ్‌ ఓ ప్రకటన చేశారు. చైనా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్‌కు ఇది తొలి విదేశీ ప్రయాణం. పదేళ్లుగా మంచి మిత్రులుగా ఉన్న ఇద్దరు అధ్యక్షులు కలిసి ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని అంతం చేసేందుకు ఆ దేశంలో రష్యాకు శాంతి చర్చలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. రష్యా పర్యటన క్రమంలో జిన్‌పింగ్‌ ఫోన్‌ ద్వారా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోడిమిర్‌ జెలెన్‌స్కీతోనూ మాట్లాడనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img