Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

గ్రీస్‌ కార్మికుల సమ్మె

ఏథెన్స్‌ : పెరుగుతున్న వేడి, విద్యుత్‌, భారమవుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా గ్రీకు ప్రజలు దేశవ్యాప్తంగా 24 గంటల సార్వత్రిక సమ్మె చేపట్టారు. సివిల్‌ సర్వెంట్లు మరియు ప్రైవేట్‌ రంగ కార్మికులు, పార్లమెంట్‌ ముందు నిర్వహించిన ర్యాలీలో సుమారు 10,000 మంది ప్రదర్శనకారులు పాల్గొన్నారు. వేతనాలు అత్యల్పం,,ఖర్చులు భారీ..అంటూ నినాదాలు చేశారు. జీవన వ్యయాలకు వ్యతిరేకంగా కార్మికుల ఉద్యమ పోరాటాన్ని ఉధృతం చేయడంలో దేశవ్యాప్త సమ్మె ముఖ్యమైన ముందడుగు అని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ గ్రీస్‌ కేకేఈ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. కొనసాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా వివాదం, పెరుగుతున్న ఇంధన, ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్న గృహాలు, వ్యాపారాల అవసరాలను తీర్చడం చాలా కష్టంగా ఉందని కార్మిక సంఘాలు పత్రికా ప్రకటనలలో పేర్కొన్నాయి, గణనీయమైన జీతాల పెంపుదలతోపాటు మరిన్ని సంస్కరణలు అవసరమని డిమాండ్‌ చేశారు. ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఇటీవల సుమారు నాలుగు బిలియన్‌ యూరోలు (4.37 బిలియన్‌ యుఎస్‌ డాలర్లు) కేటాయించింది, సగటు ఆదాయ ఉద్యోగులు, తక్కువ వేతనాలు పొందుతున్నవారు, నిరుద్యోగులకు సహాయం చేయడానికి తక్షణ చర్యలను కోరుతున్నాము.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img