Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రీస్‌లో హోచిమిన్‌ విగ్రహ ఆవిష్కరణ

కంబోడియా: వియత్నాం కమ్యూనిస్ట్టు విప్లవకారుడు, రాజనీతిజ్ఞుడు హోచిమిన్‌ గౌరవార్థం ఉత్తర గ్రీకు పట్టణం ఎడెస్సాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్ల్లు గ్రీస్‌ విదేశాంగ మంత్రి సోమవారం కంబోడియా రాజధాని హనోయిలో అధికారిక పర్యటనలో ప్రకటించారు. ‘వియత్నాం వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు హోచిమిన్‌, ఫ్రెంచ్‌ సైన్యంలో 1916-1917 కాలంలో పనిచేస్తున్న సందర్భంలో మాసిడోనియన్‌ ఫ్రంట్‌లో పోరాడారు. అందువల్ల, ఈ వాస్తవాన్ని హైలైట్‌ చేయడానికి ఎడెస్సాలో హోచిమిన్‌ ప్రతిమను నిర్మించాలని అంగీకరించినట్లు పేర్కొన్నారు. 1954లో కమ్యూనిస్టు నేతృత్వంలోని డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ వియత్నాంకు నాయకత్వం వహించారు. 1954లో ఫ్రెంచ్‌ సైన్యాన్ని ఒడిరచడంతో మొదటి ఇండోచైనా యుద్ధం ముగిసింది. ఆయన 1955 నుండి 1975 వరకు కొనసాగిన అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన వియత్నాం ప్రజల పోరాటంలో హెచిమిన్‌ కీలక పాత్ర పోషించాడు. మార్క్సిస్ట్‌-లెనినిస్ట్‌, పీపుల్స్‌ ఆర్మీ ఆఫ్‌ వియత్నాం నాయకుడు, 1951 నుండి 1969 వరకు కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ వియత్నాం ఛైర్మన్‌గా హోచిమిన్‌ దేశంలోని వలసవాద, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి నాయకత్వం వహించి సోషలిజం నిర్మాణానికి పునాదులు వేశారు. హో చి మిన్‌ 1969లో మరణించాడు, 1976లో వియత్నాం ఏకీకృతమైంది. అయితే 20వ శతాబ్దపు గొప్ప సోషలిస్టు నాయకులలో ఒకరిగా ఆయన వారసత్వం సజీవంగా ఉంది, ఆయన ప్రపంచంలోని శ్రామికులంతా ఒకే కుటుంబంగా కలిసిపోవాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img