Monday, May 6, 2024
Monday, May 6, 2024

చైనా అంటార్కిటిక్‌ సాహసయాత్ర ప్రారంభం

షాంఘై: దేశ 39వ అంటార్కిటిక్‌ యాత్ర ప్రారంభ సూచకంగా చైనా పరిశోధనాత్మక ఐస్‌బ్రేకర్‌ (మంచు పలకలను ఛేదించే) గ్జులాంగ్‌2 లేదా స్నో డ్రాగన్‌2 నౌక షాంఘై సముద్రతీరం నుండి బుధవారం బయలుదేరింది. ఈ నౌకలో మొత్తం 255 మంది పరిశోధకులు రెండు బ్యాచ్‌లుగా వాతావరణ పొందిక, జల పర్యావరణం, అవక్షేపాల పర్యావరణం, దక్షిణ ధృవంలో పర్యావరణ వ్యవస్థ రంగాలలో పరిశోధనలు జరుపుతారు. ఈ సాహసయాత్ర బృందం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో చైనా తిరిగి వస్తుందని భావిస్తున్నారు.
ధృవాల పరిశోధన కొరకు 122 మీటర్ల పొడవు, 22 మీటర్ల వెడల్పు, దాదాపు 14 వేల టన్నుల బరువు మోయగల సామర్థ్యం, 20 వేల నాటికల్‌ మైళ్ల సహనశక్తితో గల గ్జూలాంగ్‌`2 చైనా మొదటిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించింది. తూర్పు చైనాలోని షాంఘై నుండి ఈనెల 26న గ్జూలాంగ్‌ అంటార్కిటిక్‌ సాహసయాత్ర ప్రారంభమైన వెంటనే నౌకలోని చైనా పరిశోధకులు గుడ్‌బై చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img