London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Friday, October 18, 2024
Friday, October 18, 2024

నాటోలోకి మరిన్ని దేశాలు

మాడ్రిడ్‌: ప్రమాదకరమైన హెచ్చరికల మధ్య మూడురోజుల నాటో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో ప్రారంభమైన నాటో సమావేశంలో రష్యా, చైనాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రపంచ దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాలని రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతు, వ్యూహాత్మక భద్రతలో మార్పుకు నాటో సెక్రటరీ జనరల్‌ స్టోల్టెన్‌బర్గ్‌ పిలుపునిచ్చారు.నాటో పబ్లిక్‌ ఫోరం పేరుతో తొలిరోజు మాడ్రిడ్‌లో సదస్సులు జరిగాయి. రక్షణరంగంలో పెట్టుబడులకు, వాతావరణమార్పులుభద్రలపై స్టోలెన్‌బర్గ్‌ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో నాటో సభ్యుల మధ్య ఐక్యతకోసం ఐరోపాలో అమెరికా సైనిక కార్యకలాపాలను పెంచుతామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. కూటమి శిఖరాగ్ర సమావేశం మొదటి రోజున మాట్లాడుతూ, పోలాండ్‌లో నాటో కూటమి 5ఆర్మీ కార్ప్స్‌ కోసం అమెరికా శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తుందని బైడెన్‌ చెప్పారు జర్మనీ, ఇటలీలో అదనపు వైమానిక రక్షణతోపాటు ఇతర సామర్థ్యాలను నిర్వహిస్తుందన్నారు. స్పెయిన్‌లో నావికాదళ కార్యకలాపాలను నిర్మిస్తుంది, ఫిన్లాండ్‌, స్బీడన్‌లు నాటోలో సభ్యత్వం కోసం పెట్టుకున్న దరఖాస్తులపై తగిన నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. భద్రతకు సంబంధించి అన్ని మిత్ర దేశాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సి వుందని స్టోలెన్‌బర్గ్‌ అన్నారు. జపాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్‌ దేశాల అధినేతలను తొలిసారిగా శిఖరాగ్ర సమావేశానికి అతిథులుగా ఆహ్వానించారు. ఈ నలుగురూ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారు, శాంతికావాలినాటో వద్దు
మాడ్రిడ్‌: కార్మికులు, శాంతి కార్యకర్తలు, విద్యార్థులు మాడ్రిడ్‌లో జరుగుతున్న నాటో సమావేశాన్ని ఖండిరచారు. మాకు శాంతి కావాలి..నాటోను రద్దు చేయండి అంటూ వరల్డ్‌ పీస్‌ కౌన్సిల్‌ నినదించింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే నాటో సమావేశంలో 30 దేశాల ప్రతినిధులు ఆయా ప్రభుత్వాలు సామ్రాజ్యవాద ప్రణాళికలను చేపట్టనున్నారు. నాటో చరిత్ర మొత్తం నేరాలు, యుద్ధాలు, జోక్యాలు, తిరుగుబాట్లుతో ఉందని నాటో ఎప్పుడూ రక్షణాత్మక సంస్థ కాదని పేర్కొన్నారు.. నాటో అమెరికా, ఈయూల సామ్రాజ్యవాద సాయుధ విభాగంగా పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి కారణమని ప్రపంచదేశాల్లో నాటో విస్తరణను తీవ్రంగా ఖండిరచారు. నాటో తన విస్తరణ ప్రణాళికల కోసం ఉక్రెయిన్‌ యుద్ధాన్ని పురికొల్పుతోందన్నారు. 70 సంవత్సరాలుగా శాంతితో కలిసి జీవించిన ఉక్రెయిన్‌, రష్యన్‌ ప్రజల మధ్యలో నాటో ఆజ్యం పోస్తోంది. ఈ యద్ధం ప్రపంచ దేశాల మధ్య యుద్ధ ప్రమాదాలను పెంచుతోందని మండిపడ్డారు. యుద్ధాన్ని ముగించాలని చార్టర్‌ యొక్క వ్యవస్థాపక సూత్రాల ఆధారంగా రాజకీయ చర్చల పరిష్కారం సూచించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img