Friday, May 3, 2024
Friday, May 3, 2024

మలేషియా ప్రధాని యాసిన్‌ రాజీనామా

కౌలాలంపూర్‌: మలేషియా ప్రధాని మొయిదీన్‌ యాసిన్‌ సోమవారం పదవికి సాయంత్రం రాజీనామా చేశారు. పార్లమెంటులో మెజారిటీ కోల్పోవడంతో ప్రధాని పదవికి యాసిన్‌ రాజీనామా ప్రకటించారు. మలేషియా ప్రధానిగా యాసిన్‌ 18నెలల కన్నా తక్కువ కాలమే ఈ పదవిలోఉన్నారు. అయితే ప్రభుత్వంలో చాలామంది మొయిదీన్‌ యాసిన్‌ప్రభుత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. మలేషియా చక్రవర్తిని కలిసి కేబినెట్‌ రాజీనామా సమర్పించినట్లు మంత్రి జమాలుద్దీన్‌ తెలిపారు. యాసిన్‌ నిష్క్రమణ మలేషియా నూతన సంక్షోభాన్ని తీసుకువచ్చింది. ఉపప్రధాని ఇస్మాయిల్‌తో పాటు ఇతర నాయకులు ప్రధాని పదవికి పోరాటం ప్రారంభించారు. మలేషియా ప్రధానిగా 2020 మార్చిలో అధికారంలోకి వచ్చిన మొయిదీన్‌ తన కీలక మిత్రుడు మద్దతు ఉపసంహరించుకోవడంతో మెజార్టీ కోల్పోయారు. సంస్కరణలకు బదులుగా విశ్వాస ఓటింగ్‌లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన విపక్షాలను కోరారు. అయితే ప్రతిపక్ష పార్టీలతోపాటు మిత్రపక్షమైన యూఎంఎన్‌ఓ..మొయిదీన్‌ ప్రతిపాదనను తిరస్కరించారు. దీనితో మొయిదీన్‌ రాజీనామా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img