Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మా దేశానికి రావద్దు

32 మంది న్యూజిలాండ్‌ అధికారులు, జర్నలిస్టులపై రష్యా నిషేధం
మాస్కో : న్యూజిలాండ్‌ అధికారులు, జర్నలిస్టులు మొత్తం 32 మందిని తమ దేశంలో ప్రవేశాన్ని నిరాకరిస్తూ రష్యా శనివారం ఆదేశాలిచ్చింది. రష్యా పౌరులపై న్యూజిలాండ్‌ ఆంక్షలు పెరుగుతుండటానికి ప్రతిస్పందనగా తాజా చర్యలకు పూనుకున్నట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటన తెలిపింది. ఉక్రెయిన్‌తో యుద్ధం క్రమంలో మాస్కోకు వ్యతిరేకంగా వెల్లింగ్టన్‌ చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. నిషేధించిన వారిలో వెల్లింగ్టన్‌ మేయర్‌ ఆండ్రూ ఫోస్టర్‌, ఆక్‌లాండ్‌ మేయర్‌ ఫిలిప్‌ గాఫ్‌, న్యూజిలాండ్‌ నేవీ కమాండర్‌ గారిన్‌ గోల్డింగ్‌లతో పాటు జర్నలిస్టులు కేట్‌ గ్రీన్‌, జోసే పగానీ ఉన్నట్లు రష్యా ప్రకటన వెల్లడిరచింది. న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డెన్‌పై నిషేధాన్ని ఏప్రిల్‌లో రష్యా విధించిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img