Friday, May 3, 2024
Friday, May 3, 2024

యుద్ధం ఆపండి… జర్మన్ల డిమాండ్‌

ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొద్దంటూ ప్రదర్శనలు

బెర్లిన్‌: రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని డిమాండ్‌ చేస్తూ జర్మనీ ప్రజలు రోడ్లపైకొచ్చారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వవద్దని కోరారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తమ నిరసనను తెలిపేందుకు వేలాది మంది ఈస్టర్‌ సందర్భంగా శాంతి ప్రదర్శనలు చేపట్టారు. 120 నగరాల్లో ఈ ప్రదర్శనలు జరిగాయి. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేయాలని ప్రదర్శనకారులు డిమాండ్‌ చేశారు. మూడు వేల మందికిపైగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఉక్రెయిన్‌ సమస్యకు దౌత్య పరిష్కారానికి ప్రయత్నించాలని సూచించారు. బెర్లిన్‌లోని వెడ్డింగ్‌ ప్రాంతంలోని స్వ్కేర్‌ నుంచి ప్రదర్శనలు మొదలయ్యాయి. ‘అమెరికా, నాటో ఉక్రెయిన్‌ను వీడండి’. దౌత్యం కావాలి, యుద్ధం కాదు’ అన్న పోస్టర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. అవే నినాదాలు చేశారు. రష్యాపై చర్యల క్రమంలో ధరలు పెరగడంతో చవక ఇంధనం కోసం కూడా ప్రదర్శనకారులు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img