Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రష్యాచైనా విశ్వసనీయ భాగస్వాములు: జిన్‌పింగ్‌

మాస్కో: రష్యా పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సోమవారం మాస్కో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రష్యా చైనా మంచి పొరుగు దేశాలు, విశ్వసనీయ భాగస్వాములని చెప్పారు. అంతర్జాతీయ చట్టాల ఆధారంగా ప్రపంచ క్రమాన్ని కాపాడేందుకు రష్యాతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రష్యా-చైనా సంబంధాల అభివృద్ధికి, వ్యూహాత్మక సహకారానికి తన రష్యా పర్యటన కొత్త ఊపునిస్తుందని చైనా అధ్యక్షుడు భావిస్తున్నారు. నాలుగేళ్లలో జిన్‌పింగ్‌ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి. కాగా హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్ట్‌ (ఐసీసీ) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన తర్వాత ఆయనతో సమావేశమవుతున్న మొదటి ప్రపంచ నాయకుడు జిన్‌పింగ్‌. ఇద్దరు దేశాధినేతలు అధికారికంగా చర్చలు జరపడానికి ముందు సోమవారం అనధికారికంగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఉమ్మడి ప్రకటనలపై సంతకాలు చేస్తారని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img