Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

వాతావరణ మార్పులపై జి20నేతల సదస్సు

రోమ్‌: వాతావరణ మార్పు, ఆరోగ్యం, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణల లక్ష్యంగా 16వ జి20 నేతల సదస్సు దృష్టి సారిస్తుందని ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘి తెలిపారు. స్కాట్లాండ్‌లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే 26వ కాప్‌ సదస్సుకు ముందు రోమ్‌లో ఈ నెల 30 నుంచి రెండురోజులపాటు జరిగే జి20 సమావేశంలో ప్రధానంగా వాతావరణ మార్పుల పురోగతిని అంచనావేస్తుంది. ఆరోగ్య సంబంధిత సమస్యలు, కొవిడ్‌`19 వ్యాక్సిన్‌ల పంపిణీ, కొవిడ్‌ నియంత్రణ చర్యలు వంటి సమస్యలపై దృష్టి సారించనుంది. ఈ వారాంతంలో జరుగనున్న జి20 సదస్సులో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ, నియంత్రణ చర్యలు, ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు, ఆఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితిని అంచనావేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక, కార్మిక, విద్య, విదేశీ వ్యవహారాలు,అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఇంధనం, సంస్కతి, వాణిజ్యం, వ్యవసాయంపై సుదీర్ఘకాలంగా జరుగుతున్న దేశాల అధినేతల చర్చలు కూడా ఈ ఎజెండాలో చోటుచేసుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ పన్ను సంస్కరణలపై దృష్టి సారించనుంది. కార్మికచట్టాలు, లింగ సమానత్వం, విద్యా వ్యవస్థలపై కోవిడ్‌ ప్రభావం వంటి అంశాలు ప్రధాన ప్రాతిపదకలుగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img