Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

శాంతి, సామరస్యత అవశ్యం – క్యూబా అధ్యక్షుడు కానెల్‌ పిలుపు

హవానా : క్యూబాలో శాంతి, సామరస్యం, గౌరవం కోసం అధ్యక్షుడు డియాజ్‌ కానెల్‌ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. విదేశీ సంస్థల జోక్యంతో చెలరేగుతున్న అల్లర్లను, నిరసనలను దృష్టిలో ఉంచుకుని క్యూబా ప్రజలు శాంతి, సామరస్యం, సాభ్రాతృత్వంతో ఉండవలసిందిగా కోరారు. క్యూబా ప్రజల మధ్య సంఫీుభావం, సామాజిక బాధ్యత భావాలను పెంపొందించవలసిందిగా కానెల్‌ సూచించారు. విభేదాలను అధిగమించి పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఈ నెల 11న క్యూబా రాజధాని హవానాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు విధ్యంసం, హింసాత్మక చర్యలకు పాల్పడటం తెలిసిందే. ఈ సంఘటనల నుండి గుణపాఠాలు నేర్చుకోవలసిన అవసరాన్ని కానెల్‌ వక్కాణించారు. తాజా నిరసనల నేపథ్యంలో ఆహారం, ఔషధాలపై కస్టమ్స్‌ సుంకాలను ఎత్తివేసినట్లు క్యూబా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఈ ఏడాది చివరి వరకు అమలులో ఉంటుంది. ‘అల్లర్ల నుండి అనుభవాన్ని పొందాలి. మేము కూడా మా సమస్యలపై పూర్తిస్థాయి విశ్లేషణ చేయవలసి ఉంది’ అని కానెల్‌ వ్యాఖ్యానించారు. కొన్ని సమస్యలపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ పరిష్కారాల కోసం ప్రయత్నించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. క్యూబా ఆర్థిక సంక్షోభానికి అర్ధశతాబ్దపు అమెరికా ఆర్థిక ఆంక్షలు ప్రధాన కారణంగా కానెల్‌ తెలిపారు. క్యూబాలో సామాజిక అశాంతిని అమెరికా ప్రేరేపించిందని విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగెజ్‌ విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img