Friday, May 3, 2024
Friday, May 3, 2024

హంగేరిలో అత్యవసర పరిస్థితి

బుడాపెస్ట్‌: హంగేెరి ప్రభుత్వం ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపధ్యంలో దేశంలో ఇంధన భద్రతకు సంబంధించి 7-పాయింట్ల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయ అధిపతి గెర్గెలీ గులియాన్‌ తెలిపారు. ఈ చర్యలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయి. ఉక్రెయిన్‌ యుద్దం, రష్యాపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) ఆంక్షలు, ఐరోపాలో ఇంధన సంక్షోభానికి కారణమని గులియాస్‌ ఆరోపించారు, దేశ అత్యవసర ప్రణాళికలో భాగంగా, దేశీయ సహజ వాయువు ఉత్పత్తి 2 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు రెట్టింపు చేయనున్నారు. అదనపు గ్యాస్‌ సరఫరాలపై చర్చలు జరి పేందుకు ప్రభుత్వం విదేశాంగ మంత్రికి బాధ్యతలు అప్ప గించింది. ఇదే సమయంలో, ప్రభుత్వం ఇంధన వాహ కాలైన కట్టెల ఎగుమతిని నిషేధించింది. దేశీయ లిగ్నైట్‌ ఉత్పత్తిని పెంచనున్నట్లు ప్రకటించింది.బొగ్గు ఆధారిత పవర్‌ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా పునఃప్రారంభించనున్నారు. పాక్స్‌ అణు విద్యుత్‌ ప్లాంట్‌ నిర్వహణ లైసెన్స్‌ను 2042-2047 వరకు పొడిగించనుంది.విద్యుత్‌ సగటు వార్షిక వినియోగం 2,523 కిలోవాట్‌ గంటలు, గ్యాస్‌ 1,729 క్యూబిక్‌ మీటర్లుగా ప్రభుత్వం ప్రకటించింది. హంగేరిలో ద్రవ్యోల్బణం 12 శాతానికి చేరుకుంది, ఇది 24 సంవత్సరాల గరిష్టాన్ని తాకింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img