test
Sunday, May 26, 2024
Sunday, May 26, 2024

కొత్తగూడెంలోని ఓ ఇంట్లో చోరీ

విశాలాంధ్ర-మైలవరం: మండలంలోని పుల్లూరు పంచాయతి కొత్తగూడెంలో కె.వెంకటేశ్వరరావు ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడి బంగారం,నగదును దోచుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం, వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గురువారం హైదరాబాద్‌లోని పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి సుమారు 150 గ్రాముల బంగారం,లక్షన్నర రూపాయల నగదును దోచుకెళ్లినట్లు సమాచారం.మైలవరం సీఐ ఎల్‌.రమేష్‌, ఎస్‌ఐ. రాంబాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమును రంగంలోకి దించి పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img