Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

చిరిగిన ఫ్లెక్సీలపై పలు అనుమానాలు

నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన చిరిగిన బొల్లా రామకృష్ణ ఫ్లెక్సీల సంఘటన
విశాలాంధ్ర – జగ్గయ్యపేట : ఈరోజు (శుక్రవారం) సాయంత్రం నాలుగు గంటలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగ్గయ్యపేటకు ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా యువ నాయకుడు బొల్లా రామకృష్ణ ఫ్లెక్సీలు జగ్గయ్యపేట నియోజకవర్గంలో భారీ స్థాయిలో రోడ్లకు ఇరువైపులా కట్టి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించి వేశారు. అధినేత రాకముందే ఇలా ఫ్లెక్సీలను చింపడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర అసహనం మరియు అయోమయం ఏర్పడిరది. ఇది సొంత పార్టీలో వారు చేసిన పనేనా…? లేదా ఎవరైనా గుర్తు తెలియని దుండగులు సొంత పార్టీలో చిచ్చు పెట్టాలని చేసిన దుర్మార్గమా… లేక బొల్లా రామకృష్ణ ఎదుగుదలను చూసి ఓర్వలేక చేసిన పనా… అనే కోణాల్లో కార్యకర్తలు నాయకులు ఆలోచనలో పడ్డారు. పూర్తిస్థాయిలో క్యాడర్ను సంపాదించు కుంటున్నారనే కడుపు మంటతో చేసి ఉంటారని పలువురు నియోజకవర్గ మేధావులు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ త్వరలోనే దోషులు ఎవరు అనేది తేల్తారని అంటున్నారు బొల్లా అభిమానులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img