Friday, April 26, 2024
Friday, April 26, 2024

పుస్తక పఠనంతో ఎన్నో ప్రయోజనాలు

విశాలాంధ్ర`మైలవరం : స్థానిక శాఖా గ్రంధాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్‌ ఎస్‌ ఆర్‌ రంగనాథన్‌, పాతూరు నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య మొదలైన వారిని స్మరించుట.. ప్రముఖులచే ఉపన్యాసం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ లైబ్రరీ అసోసియేషన్‌ కృష్ణాజిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ టి సాంబశివరావు మాట్లాడుతూ, గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల గురించి విద్యార్థులకు బోధించడం జరిగినది, అలాగే విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని పాఠ్యాంశాలతో పాటు పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనాలను వివరించినారు. విద్యార్థులు తప్పనిసరిగా వారంలో ఏడు నుంచి ఎనిమిది గంటలు గ్రంథాలయ పుస్తకాలను చదివి వ్యక్తిగతంగా ఉద్యోగ అన్వేషణ పరంగా ప్రయోజనం పొందాలని సూచించారు, అనంతరం విద్యార్థులకు ‘నేటి సమాజంలో వృద్ధుల పరిస్థితి’ అనే అంశం పైన వ్యక్తిత్వ పోటీలు నిర్వహించడం జరిగినది,
ఈ కార్యక్రమంలో పాఠకులు విద్యార్థిని విద్యార్థులు బి డి సి నిర్వాహకులు మరియు గ్రంథాలయ ఇన్చార్జ్‌ సయ్యద్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img