Friday, April 26, 2024
Friday, April 26, 2024

సీఐ సహేరున్నీసాబేగానికి అరుదైన గౌరవం

ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనాలని అమెరికన్‌ కాన్సులేట్‌ ఆహ్వానం

విశాలాంధ్ర`విజయవాడ క్రైం : నగర పోలీస్‌ కమిషనరేట్‌లో విజిలెన్స్‌ సీఐగా పని చేస్తున్న సహేరున్నీసాబేగానికి అరుదైన గౌరవం లభించింది. అమెరికా ప్రభుత్వం 82 ఏళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ విజిటర్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రాం(ఐవీఎల్‌పీ)లో పాల్గొనాలని సహేరున్నీసా బేగానికి అమెరికన్‌ కాన్సులేట్‌ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 15 నుంచి సెప్టెంబర్‌ రెండో తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో మహిళల అక్రమ రవాణా, లింగ వివక్ష, మహిళలపై దాడులు తదితర అంశాలపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చిస్తారు. ఐవీఎల్‌పీలో పాల్గొనాలని ఆహ్వానం అందుకున్న సహేరున్నీసాబేగానికి పోలీసు అధికారులు, సహచరులు అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img