విశాలాంధ్ర-జగ్గయ్యపేట : అక్టోబర్ 14 నుండి 18వ తేదీ వరకు విజయవాడ లో జరగనున్న సిపిఐ 24వ జాతీయ మహాసభల విరాళాల సేకరణకు సిపిఐ జగ్గయ్యపేట నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఆంబోజి శివాజీ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు మాశెట్టి రమేష్ బాబు,కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు పట్టణ సహాయ కార్యదర్శి మహ్మద్ అసదుల్లా ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో నిధుల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబోజీ శివాజీ మాట్లాడుతూ….. దేశ చరిత్రలో పేరుగాంచిన మొట్టమొదటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కావున నిధుల సేకరణకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా తీసుకొని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తమ వంతుగా తమ బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం విజయరాణి కాంట్రాక్టర్ వర్కర్స్ ఏఐటియూసి మున్సిపాలిటీ నాయకులు ఉప్పల వాసు మల్లెల వినోద్ మహిళా సమైక్య నాయకురాలు ఏం విజయరాణి పాము తిరుపతమ్మ. మాతంగి రవి. రాణి నాగమ్మ, విశాలాంధ్ర విలేకర్ జానీ పాల్గొన్నారు.
